Begin typing your search above and press return to search.

హంస చెల‌రేగ‌డం వెన‌క ఇదా కార‌ణం?

By:  Tupaki Desk   |   23 March 2020 8:00 AM IST
హంస చెల‌రేగ‌డం వెన‌క ఇదా కార‌ణం?
X
హంసా నందిని.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. మత్తైన చూపులతో గమ్మత్త‌యిన ఆహార్యంతో అగ్గి రాజేసే అందం త‌న‌ది. ప్రత్యేక పాత్రలతో.. అందాల ఆరబోతతో హీటు పుట్టించ‌డం హంస హ్యాబిట్. 2004లో `ఒకటవుదాం` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అధినేత.. ప్రవరాఖ్యుడు వంటి చిత్రాలతో హీరోయిన్ గా మెప్పించింది. కానీ కథానాయికగా ఆమెకి అవకాశాలు రాలేదు. దీంతో ప్రత్యేక పాత్రలకు.. ఐటెమ్‌ సాంగ్ లకే పరిమితమైంది. హీరోయిన్ గా రాణించలేకపోయినా ఐటెమ్‌ గర్ల్ గా ఓ ఓ ఊపు ఊపింది. తన అందచందాలతో యూత్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో కుర్రకారు బాడీలో టెంపరేచర్‌ పెంచిన ఈ పుణే బొమ్మకి ఇటీవల అవకాశాలు పూర్తిగా తగ్గాయి. 2018లో `పంతం` ఆమె నటించిన చివరి చిత్రం కావడం గమనార్హం. దీంతో దాదాపు కనుమరుగైన ఈ సెక్సీ భామ చాలా రోజుల తర్వాత ఫోటోలతో అందరి చూపులను తనవైపు తిప్పుకుంటోంది. ఇటీవ‌ల వ‌రుస ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుత‌న్న హంస మ‌రోసారి చెల‌రేగింది.

సముద్ర తీరంలో ఉవ్వెత్తున్న ఎగ‌సిపడే అలలో జలకాలాడుతూ ఫోటోలకు పోజులిచ్చింది. గోధుమ రంగు టాప్‌ ధరించి అలలకు ఎదురెళ్ళుతూ ఎంజాయ్ చేస్తోంది. అల‌ల‌ తాకిడిలో త‌డిసిముద్ద‌యిపోయిన హంస ఇన్నర్‌ అందాలతో నెటిజనుల్లో గుబులు రేపింది. త‌డిపొడి అందాల త‌మ‌కంతో జాత‌రే జాత‌రకు తెర తీసింది హంస‌.

ఉన్నట్టుండి హంస ఈ కొంటెపనులు ఎందుకు చేస్తుందా? అని ఆరా తీస్తే .. ఇప్ప‌టికే హంసా నందినికి సోష‌ల్ మీడియాలో యాడ్ పోస్టింగుల రూపంలో ల‌క్ష‌ల్లో ఆదాయం ఆర్జిస్తోంద‌ట‌. అలాగే సినీఛాన్సుల‌ కోసం.. తమని తాము సర్వైవ్‌ చేసుకోవడం కోసం ఇలాంటి ఫోటో షూట్ లతో చెల‌రేగుతోంది. ఎలాగూ హంసకి రెండేళ్ళుగా ఒక్క ఛాన్స్ అయినా లేదు. మరి ఈ ఫోటోలను చూసైనా అవకాశాలిస్తారేమో చూడాలి. మళ్ళీ హంస అందాల జాత‌ర తెరపై చూసే వీలుందో లేదో మ‌రి.