Begin typing your search above and press return to search.

ఆర్‌ఆర్‌ఆర్‌ లో హంస కూడానట!

By:  Tupaki Desk   |   6 Feb 2020 6:00 PM IST
ఆర్‌ఆర్‌ఆర్‌ లో హంస కూడానట!
X
రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇటీవలే అధికారికంగా ప్రకటన వచ్చింది. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పాన్‌ ఇండియా లెవల్‌ లో రూపొందిస్తున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. చరణ్‌.. ఎన్టీఆర్‌.. ఆలియా.. అజయ్‌ దేవగన్‌ లతో పాటు ఇంకా ఎంతో మంది స్టార్స్‌ ఈ చిత్రంలో నటిస్తున్నారు.

చిన్న పాత్ర పెద్ద పాత్ర అనే తేడా లేకుండా అన్ని పాత్రలకు కూడా వెల్‌ నోటెడ్‌ ఆర్టిస్టులను జక్కన్న తీసుకుంటున్నాడు. ఆ క్రమంలోనే ఈ చిత్రంలోని ఒక పాత్రకు హంస నందినిని తీసుకున్నట్లు గా సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ఆమె షూటింగ్‌ కు హాజరు అవ్వబోతుందట. అధికారికంగా ఈ విషయమై క్లారిటీ ఇవ్వలేదు.. కాని హంస తన సన్నిహితులతో ఈ విషయాన్ని షేర్‌ చేసుకుందట.

గతంలో ఈగ చిత్రంలో చిన్న పాత్రను హంస నందిని తో చేయించిన రాజమౌళి మరోసారి ఆమెకు ఛాన్స్‌ ఇచ్చాడు. హీరోయిన్‌ గా పరిచయం అయిన హంస ఆ తర్వాత ఐటెం సాంగ్స్‌ కు పరిమితం అయ్యింది. ఇప్పుడు అసలు ఛాన్స్‌ లేకుండా ఉంది. ఇలాంటి సమయం లో జక్కన్న నుండి పిలుపు రావడం తో ఈమెకు మళ్లీ కెరీర్‌ పై ఆశలు కలిగే అవకాశం ఉందంటున్నారు.