Begin typing your search above and press return to search.
ఘాటుఘాటు అందాలను గుప్పిస్తున్న మిర్చి భామ!
By: Tupaki Desk | 1 May 2020 8:40 PM ISTప్రభాస్ తో మిర్చి సినిమాలో ప్రత్యేక పాటలో ఆడిపాడి వేడి పుట్టించిన హంసానందిని. టాలీవుడ్ స్టార్ హీరోల ప్రత్యేక పాటలలో బిజీగా మారింది. ఐటమ్ సాంగ్స్ అంటే కాస్తో.. కూస్తో కాదు ఊహించని రీతిలో ప్రేక్షకులను అలరించాలి. ప్రస్తుతం కమర్షియల్ ఎంటర్టైనింగ్ సినిమాలకు ఐటెం సాంగ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా తయారవుతున్నాయి. అలాగే వీటిపై అంచనాలు కూడా బాగా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి సాంగ్ లోనూ డాన్సులు, వేషదారణ, హావభావాలు మార్చుకోవాలి. ఇవన్నీ కూడా హంసానందినిలో చక్కగా ఇమిడి ఉన్నాయి. అంతకు మించిన అందం కూడా ఉండటం వల్ల ప్రస్తుతం టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇందంతా ఆమెకు మోడలింగ్ మీద ఉన్న ప్రభావమే ఆమెను ఇంతంటి స్థాయికి తీసుకొచ్చిందని చెప్పవచ్చు.
ప్రస్తుతం సినీ అవకాశాలు లేక మోడలింగ్ నే నమ్ముకుంది సుందరి. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ రోజువారీ కార్యక్రమాలతో సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరిస్తున్నారు. ఇక తాజాగా హంసా నిజంగానే హంసలాంటి అందాలు కలిగి ఉందని నమ్మే విధంగా తను బీచ్ లో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. బికినీలో తన అందాలను ఆరబోస్తుంది. ఈ ఫోటో చూసిన ప్రతీ ఒక్కరూ అమ్మడు శృంగార దేవతలా ఉందని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ మధ్య ఈ భామ కొత్త కొత్త డ్రెస్సింగ్ స్టైల్స్ తో, నూతన డిజైన్లతో కూడిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి తన అందాల విందును పంచుతుంది.