Begin typing your search above and press return to search.

స‌ర్జ‌రీల‌కు టైమొచ్చిందంటున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   24 Feb 2022 11:30 AM GMT
స‌ర్జ‌రీల‌కు టైమొచ్చిందంటున్న హీరోయిన్
X
వంశీ తెర‌కెక్కించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ `అనుమానాస్ప‌దం`. ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ హంసా నందిని. గ‌త కొంత కాలంగా ఈ హీరోయిన్ బ్రెస్ట్ క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతోంది. త‌ను బ్రెస్ట్ క్యాన్స‌ర్ తో బాద‌ప‌డుతున్నాన‌ని, ఇందుకు సంబంధించిన ట్రీట్మెంట్ ని ఇటీవ‌లే ప్రారంభించాన‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్ ని షేర్ చేసి షాకిచ్చింది. అంతే కాకుండా ఈ పోస్ట్ కి గుండుతో వున్న త‌న ఫొటోని షేర్ చేయ‌డంతో అభిమానులు తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు.

తాము అభిమానించే హీరోయిన్ ఇలా క్యాన్స‌ర్ బారిన ప‌గ‌డ‌టం ప‌లువురిని ఆవేద‌న‌కు గురిచేసింది. అప్ప‌టి నుంచి ప‌లు ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వ‌స్తున్న హంసా నందిని తాజాగా గురువారం ఓ ఎమోష‌న‌ల్‌ పోస్ట్ ని షేర్ చేసింది. ప్ర‌స్తుతం క్యాన్స‌ర్ కు చికిత్స పొందుతున్న హంస ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు 16 సైకిల్స్ కీమోథెర‌పీ చికిత్స జ‌రిగింద‌ని, ఈ ప్ర‌క్రియ విజ‌య‌వంతంగా పూర్త‌యింద‌ని తాజాగా రెండు ఫొటోల‌ని నెట్టింట షేర్ చేసింది.

`నేను 16 సైకిల్స్ కీమోథెర‌పీ చికిత్స‌ని పూర్తి చేశాను. ఇప్పుడు నేను పూర్తిగా కీమో నుంచి కోలుకున్నాను. కానీ నా పోరాటం ఇంకా ముగియ‌లేదు. ఇందులో ఇంకా విజ‌యం సాధించ‌లేదు. నేను త‌దుప‌రి యుద్ధాల‌కు సిద్ధ‌మ‌య్యే స‌మ‌యం వ‌చ్చేసింది. ఇది స‌ర్జ‌రీలు చేయాల్సిన స‌మ‌యం` అంటూ సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా చెప్ప‌కొచ్చింది.

గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో తాను బ్రెస్ట్ క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్న‌ట్టుగా సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఇదే సంద‌ర్భంగా త‌న త‌ల్లి కూడా ఇదే స‌మ‌స్య‌తో పోరాడి ప్రాణాలు కోల్పోయింద‌ని, ఇప్పుడు తాను ఈ క్యాన్స‌ర్ తో పోరాడుతున్నాన‌ని, ఈ వ్యాధి నా జీవితాన్ని మార్చ‌వ‌చ్చ‌ని అయితే నేను దీనిని చిరున‌వ్వుతోనే పోరాడి జ‌యిస్తాన‌ని మ‌ళ్లీ మ‌రింత బ‌లంగా తెర‌పైకి వ‌స్త‌న‌ని వెల్ల‌డించింది.

హంసా నందిని అస‌లు పేరు పూన‌మ్‌. అయితే త‌న పేరుని హంసా నందినిగా ద‌ర్శ‌కుడు వంశీ మార్చేశార‌ట‌. ఇండ‌స్ట్రీలో చాలా మంది న‌టీమ‌ణులు పూన‌మ్ పేరుతో వుండ‌టంతో మ‌ళ్లీ ఆ పేరు ఎందుక‌ని భావించిన వంశీ హంసా నందినిగా నామ‌క‌ర‌ణం చేశార‌ట‌. `అనుమానాస్ప‌దం` చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హంసా నందిని మిర్చి - అత్తారింటికి దారేది - భాయ్ - సోగ్గాడే చిన్ని నాయ‌నా వంటి త‌దిత‌రు చిత్రాల్లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది.