Begin typing your search above and press return to search.

మంచు విష్ణు, మోహ‌న్ బాబుపై హెయిర్ డ్రెస్స‌ర్ సంచ‌ల‌నం

By:  Tupaki Desk   |   28 Feb 2022 3:18 PM GMT
మంచు విష్ణు, మోహ‌న్ బాబుపై హెయిర్ డ్రెస్స‌ర్ సంచ‌ల‌నం
X
'మా' అధ్య‌క్షుడు మంచు విష్ణు కార్యాల‌యంలో చోరీ జ‌రిగింద‌ని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ లో వున్న విలువైన సామాగ్రీ క‌నిపించ‌డం లేద‌ని మంచు విష్ణు మేనేజ‌ర్ సంజ‌య్ జూబ్లీ హిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేపిన విష‌యం తెలిసిందే.

రూ. 5 ల‌క్ష‌ల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రిని దుండ‌గులు దొంగిలించార‌ని, అయితే అప్ప‌టి నుంచి హెయిర్ డ్రెస్స‌ర్ నాగ శ్రీ‌ను క‌నిపించ‌డం లేద‌ని, ఈ చోరీలో త‌న హ‌స్తం కూడా వుండొచ్చ‌ని అనుమానం వ్య‌క్తం చేస్తూ అత‌నిపై కూడా కేసు పెట్టారు. సోమ‌వారం విష‌యం వెలుగులోకి రావ‌డంతో సంచ‌ల‌నంగా మారింది.

ఈ విష‌య‌న్ని సీరియ‌స్ గా తీసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసి లోతుగా ద‌ర్యాప్తు మొద‌లుపెట్టారు. ఇదిలా వుంటే తాజా ఇష్యూ మ‌రో మ‌లుపు తిరిగింది. నిందితుడంటూ మంచు విష్ణు మేనేజ‌ర్ సంజ‌య్ అనుమానం వ్య‌క్తం చేసిన హెయిర్ డ్రెస్స‌ర్ నాగ శ్రీ‌ను తాజాగా ఓ వీడియోని విడుద‌ల చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. స‌ద‌రు వీడియోలో మంచు హీరోల‌పై నాగ‌శ్రీ‌ను సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మోహ‌న్ బాబు, 'మా' అధ్య‌క్షుడు మంచు విష్ణు క‌లిసి నన్ను చిత్ర హింస‌ల‌కు గురిచేశార‌ని, చెప్పుకోలేని విధంగా బూతులు తిట్టి కులం పేరుతో అవ‌మానించార‌ని, ఆ కార‌ణంగానే తాను ఉద్యోగం మానేశాన‌ని, అలా తాను ఉద్యోగం మానేసిన కార‌ణంగానే త‌న‌పై రూ. 5 ల‌క్ష‌ల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రిని తాను చోరీ చేసిన‌ట్టుగా అక్క‌మ కేసుని బ‌నామిస్తున్నార‌ని, మోహ‌న్ బాబు న‌న్ను తిట్ట‌డం, నన్ను మోకాళ్ల‌పై కూర్చోబెట్టి కొట్ట‌డం అక్క‌డ వున్న సీసీటీవీ లో రికార్డ్ అయింద‌ని, ఇదంతా ఫిబ్ర‌వ‌రి 17న మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌ల‌కు జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

అంతే కాకుండా త‌న‌పై లేనిపోని కేసులు పెట్ట‌డంతో ఆ విష‌యం తెలిసి నా త‌ల్లి గుండెపోటుకు గురైంద‌ని, ప్ర‌స్తుతం హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతోంద‌ని తెలిపాడు. గ‌త 10 ఏళ్లుగా న‌మ్మ‌కంగా మోహ‌న్ బాబు వ‌ద్ద తాను ప‌ని చేస్తున్నాన‌ని, నా పై ఇలాంటి నిద‌లు వేయ‌డం మీకు భావ్యం కాద‌ని, విష్ణు బాబు త‌న‌పై ఆన‌వ‌స‌రంగా కేసు పెట్టార‌ని, వారు అన్న బూతులు నేను మీకు చెప్ప‌లేన‌ని, ఆ బూతులు ప‌డ‌లేకే తాను ఉద్యోగం వ‌దిలేశాన‌ని చెప్పుకొచ్చాడు.

నా లాంటి చిన్నవారి జీవితాల‌తో ఆడుకోవ‌డం మీలాంటి పెద్ద‌ల‌కు త‌గ‌దు. ద‌య‌చేసి న‌న్ను వ‌దిలేయండి. ఈ వీడియో చూసిన పెద్ద‌లు నాకు న్యాయం చేయండి` అని నాగ శ్రీ‌ను మొర‌పెట్టుకోవ‌డం ఇప్ప‌డు సంచ‌ల‌నంగా మారింది. దీనిపై మంచు ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో చూడాలి అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.