Begin typing your search above and press return to search.

సిక్స్‌ ప్యాక్‌ లో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌!

By:  Tupaki Desk   |   1 Aug 2015 9:36 AM GMT
సిక్స్‌ ప్యాక్‌ లో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌!
X
షాకుల మీద షాకులు ఇస్తున్నాడు మ్యూజిక్ డైరెక్ట‌ర్ జీవీ ప్ర‌కాష్‌ కుమార్‌. ఏఆర్ రెహ్మాన్ అల్లుడైన ఈయ‌న త‌న మామ‌లాగే మ్యూజిక్ సైడ్ అడుగేశాడు. దాదాపు 50 సినిమాల‌కి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ గా ప‌నిచేశాడు. అంత చిన్న వ‌య‌సులో హాఫ్ సెంచ‌రీనా అని అంద‌రూ వండ‌ర్ అయ్యారు. ఆ త‌ర్వాత అనూహ్యంగా హీరోగా మారి మ‌రోసారి షాకిచ్చాడు. జీవీ కి హీరోగా బాగానే క‌లిసొచ్చింది. ప్ర‌స్తుతం త‌మిళంలో రెండు మూడు సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్నాడు. త‌దుప‌రి `బ్రూస్లీ` పేరు తో మ‌రో సినిమా చేయ‌డానికి గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. అయితే ఈ సినిమాలో ఆయ‌న స‌మంత‌తో రొమాన్స్ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం అందింది. ఆ విష‌యం తెలిసిన‌ప్ప‌ట్నుంచి జీవీ ప‌క్క‌న స‌మంత‌నా అని మ‌రోసారి షాక్ తింటున్నారు సినిమా అభిమానులు. దాన్నుంచి తేరుకోక ముందే మ‌రోసారి జీవీ అంద‌రినీ వండ‌ర్ చేశాడు.

అదెలాగంటే `బ్రూస్లీ`లో జీవీ సిక్స్‌ ప్యాక్‌ తో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. `బ్రూస్లీ` అని పేరు పెట్టాక తెర‌పై సిక్స్‌ ప్యాక్‌ తో క‌నిపించ‌క‌పోతే ఏం బావుంటుంది అనుకొన్నారో ఏమో జీవీని సిక్స్‌ ప్యాక్ త‌యారు చేయ‌మ‌న్నాడట ద‌ర్శ‌కుడు. నేనా సిక్స్‌ ప్యాకా? అన‌కుండా జీవీ కూడా ఓకే చెప్పేసి వెంట‌నే క‌స‌ర‌త్తులు చేయ‌డం కూడా మొదలుపెట్టాడ‌ట‌. నిన్న‌గాక మొన్న హీరోగా ఎంట్రీ ఇచ్చిన జీవీ సిక్స్‌ ప్యాక్‌ కోసం క‌ష్ట‌ప‌డ‌ట‌మంటే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే క‌దా! జీవీ ప్ర‌కాష్‌ కి త‌మిళంలో క‌థానాయ‌కులంద‌రితోనూ మంచి అనుబంధ‌ముంది. వాళ్లంతా జీవీ కి మంచి ఎంక‌రేజ్‌ మెంట్ ఇస్తున్నారు. సిక్స్‌ ప్యాక్ విష‌యంలో కూడా ఆర్య‌లాంటి ఒక‌రిద్ద‌రు హీరోలు జీవీ కి హెల్ప్ చేస్తున్నారట‌. అన్న‌ట్టు జీవీ సిక్స్ ప్యాక్ చేస్తున్న విష‌యాన్ని కూడా ఆర్య‌నే బ‌య‌ట‌పెట్టాడు. భ‌విష్య‌త్తులో జీవీ ప్ర‌కాష్ మాస్ హీరోగా పేరు తెచ్చుకొంటాడేమో మ‌రి!