Begin typing your search above and press return to search.

కరోనా డేస్ లో మూడో సినిమాని రిలీజ్ చేస్తున్న ఓటీటీ స్టార్ హీరో..!

By:  Tupaki Desk   |   8 Dec 2020 10:04 AM IST
కరోనా డేస్ లో మూడో సినిమాని రిలీజ్ చేస్తున్న ఓటీటీ స్టార్ హీరో..!
X
టాలీవుడ్ లో వైవిధ్యభరిత సినిమాలు విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్. 'అంతరిక్షం' 'ఘాజీ' 'బ్లఫ్ మాస్టర్' 'ఇస్మార్ట్ శంకర్' 'బ్రోచేవారెవరు రా' సినిమాలతో ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఇక వెబ్ వరల్డ్ లో కూడా అడుగుపెట్టిన సత్యదేవ్.. 'గాడ్స్ ఆఫ్ ధర్మపురి' 'లాక్డ్' అనే వెబ్ సిరీస్ లలో కూడా నటించాడు. 2020లో స్టార్ హీరోలందరూ సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో ఓటీటీ వేదికగా రెండు సినిమాలను విడుదల చేసి ప్రేక్షకులను అలరించాడు. ఈ క్రమంలో సత్యదేవ్ ఓటీటీ స్టార్ హీరోగా మారిపోయాడని సినీ జనాల నుంచి కామెంట్స్ వచ్చాయి. అయితే సత్యదేవ్ నుంచి మరో సినిమా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ కి రెడీ అయింది.

సత్యదేవ్ హీరోగా నటించిన '47 డేస్' సినిమా జీ 5 ఓటీటీలో విడుదల అయింది. అలానే 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' కూడా ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. వీటిలో '47 డేస్' పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా మంచి టాక్ తో నడిచింది. ఈ సినిమాలతో హీరోగా నిలదొక్కుకున్న సత్యదేవ్.. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో సత్యదేవ్ హీరోగా నటించిన 'గువ్వ గోరింక' చిత్రాన్ని నెల 17న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయనున్నారు. ప్రియాలాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రియదర్శి - రాహుల్ రామకృష్ణ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రామ్ గోపాల్ వర్మ దగ్గర 'సర్కార్' నుండి 'రక్తచరిత్ర' వరకు అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన మోహన్ బమ్మిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. జీవన్ రెడ్డి - దాము సంయుక్తంగా నిర్మించారు. ఇలా కరోనా డేస్ లో కూడా మూడు సినిమాలను మూడు డిఫరెంట్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేసిన సత్యదేవ్.. ఈ ఏడాది ప్రేక్షకులకు ఎక్కువ సినిమాలు అందించిన తెలుగు హీరోగా నిలిచాడు.