Begin typing your search above and press return to search.

వీడియో: అంగరంగ వైభవంగా జరిగిన గుత్తా జ్వాల - విష్ణు విశాల్ వివాహం

By:  Tupaki Desk   |   8 Sep 2021 12:30 AM GMT
వీడియో: అంగరంగ వైభవంగా జరిగిన గుత్తా జ్వాల - విష్ణు విశాల్ వివాహం
X
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ - బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఏప్రిల్ 22న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లపాటు డేటింగ్ చేసిన ఈ ప్రేమ జంట.. గత ఏడాది సెప్టెంబర్ లో నిశ్చితార్థం చేసుకొని, ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ లో వీరి వివాహం.. ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది అతిథుల సమక్షంలో జరిగింది. కరోనా నేపథ్యంలో తక్కువ మంది హాజరైనప్పటికీ.. వివాహ వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారని తెలుస్తోంది.

గుత్తా జ్వాల - విష్ణు విశాల్ వివాహం జరిగి నాలుగున్నర నెలలు అవుతుండగా.. తాజాగా విష్ణు విశాల్ వారి పెళ్లికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. నేడు (సెప్టెంబర్ 7) తన భార్య గుత్తా జ్వాల పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని.. విష్ణు ఈ వీడియోని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయడం విశేషం. ''మా పెళ్లి వీడియో మొత్తం మీతో పంచుకుంటున్నాం.. ఈ జీవిత ప్రయాణంలో ఇప్పటివరకు ప్రేమను పంచిన అందరికీ ధన్యవాదాలు. అందమైన వీడియో ఇచ్చిన 'ది స్టోరీ బాక్స్' కి ధన్యవాదాలు. హ్యాపీ బర్త్ డే గుత్తా జ్వాలా'' అని విష్ణు విశాల్ ట్వీట్ చేశారు.

ఈ వీడియోలో మెహందీ వేడుక నుంచి.. హల్దీ ఫంక్షన్ - సంగీత్ - వివాహ వేడుక - రిసెప్షన్ వరకు జరిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. గుత్తా జ్వాల - విష్ణు విశాల్ లు సాంగ్స్ పాడుతూ డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. వీటితో పాటుగా కుటుంబ సభ్యులు - స్నేహితులు కూడా స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ సెలబ్రిటీ కపుల్ పెళ్లి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే విష్ణు విశాల్ - గుత్తా జ్వాల ఇద్దరికి కూడా ఇది రెండో వివాహమనే విషయం తెలిసిందే. 2005లో బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ ను మ్యారేజ్ చేసుకున్న జ్వాల.. కొన్ని కారణాల వల్ల 2011లో విడాకులు తీసుకున్నారు. ఇక 2010లో తమిళ నటుడు కె.నటరాజ్ కుమార్తె రజనీ నటరాజన్ ను పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్.. 2018లో ఆమెతో విడాకులు తీసుకొని విడిపోయారు. వీరికి ఓ అబ్బాయి కూడా ఉన్నాడు.