Begin typing your search above and press return to search.

నాపై వేధింపులకు అతడిదే బాధ్యత: గుత్తాజ్వాల

By:  Tupaki Desk   |   10 Jun 2020 10:10 AM GMT
నాపై వేధింపులకు అతడిదే బాధ్యత: గుత్తాజ్వాల
X
గుత్తాజ్వాల.. ఈ స్టార్ బ్యాడ్మింటన్ స్టార్ ఆ ఆటలోనే కాదు.. సినిమాలు, షికార్లు, పబ్బులు, టాలీవుడ్ తోనూ మంచి సంబంధాలున్నాయి. నితిన్ సినిమాలో ఓ పాటలో కూడా మెరిసిందీమే.

2004లో స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ తో కలిసి గుత్వా జ్వాల మిక్స్ డ్ డబుల్స్ ఆడేది. వీరిద్దరూ నేషనల్ బాడ్మింటన్ చాంపియన్ షిప్ టైటిల్ ను కూడా గెలుచుకున్నారు. ఇండియన్ డబుల్స్ విభాగంలో జ్వాల ప్రముఖ ప్లేయర్ గా గుర్తింపు పొందారు.

అయితే తన బ్యాడ్మింటన్ కెరియర్ లో చాలా అవకాశాలు కోల్పోయానని.. వాటికి గోపీచంద్ బాధ్యత వహిస్తాడు అని గుత్తా జ్వాల సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇన్ని సంవత్సరాలుగా తాను అనుభవించిన వేధింపులకు గోపీచంద్ బాధ్యత వహించాలని అని ఆమె తెలిపింది. నేను చెప్పాలి అనుకునే దానికోసం చాలా పెద్ద ధర చెల్లించాల్సి వచ్చింది’ అని జ్వాల తెలిపింది.

పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణకు ఇతర రాష్ట్రాల ఆటగాళ్లు కూడా వస్తారని.. అయితే 10-12 ఏళ్లుగా హైదరాబాద్ లేదా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఆటగాళ్లకు మాత్రమే ప్రాముఖ్యత కలిగి ఉన్నారని.. భారతదేశం పతకం గెలిస్తే గోపీచంద్ వల్లనేనని.. ఇలా వ్యవస్థను మెయింటేన్ చేయడం ఏంటని జ్వాలా సంచలన వ్యాఖ్యలు చేశారు.