Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా లో పోస్టు చేసి పర్సనల్ అంటారేంటి జ్వాల

By:  Tupaki Desk   |   3 Jan 2020 4:30 AM GMT
సోషల్ మీడియా లో పోస్టు చేసి పర్సనల్ అంటారేంటి జ్వాల
X
సెలబ్రిటీల మాటలు ఈ మధ్యన సిత్రంగా ఉంటున్నాయి. ఎవరూ అడగకుండానే పబ్లిక్ కు సమాచారం ఇచ్చేందుకు వీలుగా తమ పర్సనల్ విషయాల్ని పోస్టు చేయటం తెలిసిందే. కానీ.. అదే అంశాన్ని అడిగితే మాత్రం చిర్రుబుర్రులాడటం కనిపిస్తోంది. తాజాగా ప్రముఖ మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల.. తనకు సంబంధించిన పర్సనల్ ఫోటోల్ని పబ్లిక్ కు అందుబాటులోకి తెచ్చేయటం తెలిసిందే. కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ తో తనకున్న వ్యక్తిగత బంధాన్ని బయట కు వెల్లడిస్తూ సోషల్ మీడియా ఫోటోల్ని షేర్ చేయటం.. అవి కాస్తా వైరల్ గా మారటం తెలిసిందే.

ఫోటోల్ని షేర్ చేసిన రెండో రోజున రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఆమె ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అకాడమీ అధికారిక వెబ్ సైట్ ను లాంచ్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ తదితరులు హాజరయ్యారు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించిన అకాడమీలో అత్యాధునిక ప్రమాణాలతో పద్నాలుగు బ్యాడ్మింటన్ కోర్టుల్ని ఏర్పాటు చేశారు. నిష్ణాతులైన విదేశీ కోచ్ లు. ఫిజియోథెరపిస్టుల సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు.

రానున్న రోజుల్లో క్రికెట్.. టెన్నిస్.. స్కేటింగ్ క్రీడాంశాల్లోనూ కోచింగ్ ఇవ్వనున్నారు. ఇంత భారీ వ్యాపార ప్లాన్ చేసిన గుత్తా జ్వాల.. తాను చేసే ప్రతి పనికి సంబంధించి లెక్క పక్కాగా ఉంటుందన్నది మర్చిపోకూడదు. ఇలాంటప్పుడు సోషల్ మీడియాలో తన పర్సనల్ ఫోటోల్ని పోస్టు చేయటం వెనుక ఆమెకుండే లెక్కలేవో ఉండి ఉంటాయి. మహా కవి శ్రీశ్రీ అన్నట్లు..పబ్లిక్ లోకి వచ్చేశాక ఏమైనా అడిగేస్తామన్న మాట ప్రకారం చూసినప్పుడు తనకు తానుగా పెట్టిన ఫోటోల గురించి వివరణ అడగటంలో ఎలాంటి తప్పు లేదు.

కానీ.. ఇప్పటి సెలబ్రిటీల వ్యవహారం ఎలా తయారైందంటే.. తాము తోచినట్లు చేస్తాం కానీ.. ఎందుకు? అన్నది మాత్రం అడగొద్దంటున్నారు. మీ రిలేషన్ షిప్పు? అన్న ప్రశ్నను అడగొద్దని గుత్తా జ్వాల చెప్పటం దీనికి నిదర్శనం. సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోల మీద వివరణ ఇచ్చే విషయంలో మీడియాతో గుత్తా జ్వాల చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి.

అది నా వ్యక్తిగత అంశం.. వివాదం చేయొద్దనటం గమనార్హం. అందులో వివాదం చేయటానికి ఏముంది? అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు.. ముద్దు పెట్టుకునే ఫోటోల్ని పోస్టు చేసేటప్పుడు లేని అభ్యంతరం.. దాని మీద ప్రశ్న అడిగితే రియాక్ట్ కావటానికి ఇష్టపడక పోవటం విశేషం. అంత పర్సనల్ అయితే.. పబ్లిక్ లోకి ఫోటోల్ని పెట్టాల్సిన అవసరమే లేదు. పబ్లిక్ గా పోస్టులు పెడతాం కానీ విషయాల్ని మాత్రం ప్రైవేటుగా ఉంచుతామనటం గుత్తా జ్వాలకే చెల్లుతుందని చెప్పాలి.