Begin typing your search above and press return to search.

టీజర్ టాక్‌: 'గురు'వుగారు స్టెప్పులేస్తే

By:  Tupaki Desk   |   13 Dec 2016 5:50 AM GMT
టీజర్ టాక్‌: గురువుగారు స్టెప్పులేస్తే
X
విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ గురు. ఆ మధ్య వరుసగా మల్టీ స్టారర్ లు చేసి.. బాబు బంగారంతో మళ్లీ సోలో హీరో చిత్రాల బాట పట్టిన వెంకీ.. ఈ సారి సీరియస్ మూడ్ తో సాగే సినిమా చేస్తున్నాడు. చాలా షార్ట్ స్పాన్ లో ఈ మూవీ షూట్ కంప్లీట్ అయిపోగా.. ఇప్పుడీ చిత్రానికి అఫీషియల్ టీజర్ రిలీజ్ చేశారు.

ఇవాళ (డిసెంబర్ 13) విక్టరీ వెంకటేష్ బర్త్ డే సందర్భంగా గురు టీజర్ ను రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ వైనాట్ స్టూడియోస్. టీజర్ ఆసాంతం వెంకీ వేసే స్టెప్పులతో నింపేశారు. గురువు గారు పూర్తి స్థాయి ఎంజాయ్ మెంట్ మూడ్ లో ఉంటే ఎలా ఉంటుందో.. పక్కాగా టీజర్ అదే స్టైల్ లో ఉంది. వెంకీ తన ట్రేడ్ మార్క్ స్టెప్స్ తో పాటు.. మరికొన్ని కొత్తగా కూడా ట్రై చేశాడు.

వెంకీ స్టెప్స్ తో పాటు ట్రైలర్ లో చెప్పుకోవాల్సిన విషయం.. వెంకటేష్ గెటప్ గురించే. కాసింత ఏజ్డ్ గెటప్ అయినా.. ఎనర్జీ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా చూపించాడు వెంకీ. ఇక సినిమా రిలీజ్ విషయానికి వస్తే.. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయిపోగా.. జనవరి 26న థియేటర్లలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదట సంక్రాంతికే విడుదల చేద్దామని అనుకున్నా.. ఆ సీజన్ లో ఉన్న పోటీ కారణంగా.. రెండు వారాలు వెనక్కి వెళ్లాడు గురు.