Begin typing your search above and press return to search.

బాలీవుడ్ బ్యూటీ కోసం ట్రై చేస్తున్న క్రియేటివ్ డైరెక్టర్...?

By:  Tupaki Desk   |   14 Oct 2020 2:30 AM GMT
బాలీవుడ్ బ్యూటీ కోసం ట్రై చేస్తున్న క్రియేటివ్ డైరెక్టర్...?
X
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ లేటెస్టుగా ''శాకుంతలం'' అనే న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల - దుష్యంత మహారాజు ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ ఎపిక్ లవ్ స్టోరీని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ లో గుణశేఖర్ కూతురు నీలిమ గుణ నిర్మిస్తున్నారు. సంగీత బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చనున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. ఇప్పటివరకు వెండితెరపై రాని కథాంశం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో శకుంతల పాత్రలో ఎవరు నటిస్తారని డిస్కషన్ స్టార్ట్ చేశారు.

కాగా, దుష్యంతుడితో ప్రేమ.. వారి గాంధర్వ వివాహం.. భర్త కోసం ఎదురు చూసే భార్య.. శాపం వల్ల తనని మర్చిపోయిన భర్తను తలచుకుని బాధ పడే భార్య.. ఇలా అనేక అంశాలు శకుంతల ప్రేమ కథలో మిళితమై ఉంటాయి. అలాంటి పాత్రకు ఎవరు న్యాయం చేస్తారని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్స్ సమంత - అనుష్క - పూజా హెగ్డేలను 'శకుంతల' పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మెయిన్ లీడ్ కోసం టాలీవుడ్ హీరోయిన్లను సంప్రదించడం లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న సినిమా కావడంతో బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుంటే మార్కెట్ పరంగా ప్లస్ అవుతుందని గుణశేఖర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి చివరికి ఈ ఎపిక్ లవ్ స్టోరీలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారో చూడాలి.