Begin typing your search above and press return to search.

ఫ్లాష్.. ఫ్లాష్.. రుద్రమదేవి పార్ట్ 2

By:  Tupaki Desk   |   4 Aug 2015 10:49 AM IST
ఇది కాస్త ఆశ్చర్యం కలిగించేదే అయినా తేరుకుని జీర్ణించుకోవాల్సిందే. రుద్రమదేవి కోసం ఇప్పటికే అనేక కష్ట నష్టాలకోర్చిన దర్శకుడు గుణశేఖర్ చెప్పాలనుకుంటున్నది కేవలం వీరనారి రుద్రమదేవి కథ మాత్రమే కాదట. మొత్తం కాకాతీయ సామ్రాజ్యం గురించట. అందుకనే రుద్రమదేవి విడుదల తర్వాత సీక్వెల్ తెరకెక్కించే ఉద్దేశంలో వున్నారుట.

ఇటువంటి చారిత్రక కథలు అసంపూర్ణంగా వదిలేయకూడదని ఈ పనికి పూనుకున్నారట. ఇప్పటికే ఔట్ లైన్ స్టొరీ సిద్ధం చేసిన దర్శకుడు ప్రస్తుతం రుద్రమదేవికి తుది మెరుగులు దిద్దుతూనే తర్వాతి పార్ట్ కి సంబంధించి పూర్తి స్థాయి స్క్రిప్ట్ ని తయారుచేస్తున్నారు. రుద్రమదేవి మనుమడు (కుమార్తె కొడుకు) ప్రతాపరుద్రుని కథని ఈ సినిమా తెరకెక్కుతుందట. టైటిల్ కూడా ప్రతాపరుద్రుడు - ది లాస్ట్ ఎంపరర్ గా రిజిస్టర్ చేశారని సమాచారం.

అంతాబానే వుంది కాని.. గుణశేఖర్ రుద్రమదేవి కోసమే వున్నదంతా వూడగొట్టుకున్నారనీ పైగా అప్పులు కూడా చేశారని వినవస్తోంది. గతంలో వచ్చిన చారిత్రిక సినిమాలు వచ్చి విజయం సాధించాయి. చాన్నాళ్ళకు ఆ తరహా సినిమాలకు బాహుబలి బీజం వేసింది. ఆ ధైర్యంతోనే ఇటువంటి కథలు మరిన్ని రావడం శుభపరిణామమే అయినా సినిమా వ్యాపారంతో ముడిపడి వుంది కనుక రుద్రమదేవి ఫలితంపైనే సీక్వెల్ ఆధారపడి వుందనేది అసలు విషయం. ఇకపోతే ఢిల్లీ సుల్తానులని ఏడుసార్లు తిప్పి కొట్టాడు ప్రతాప రుద్రుడు. ఆ పాత్ర ప్రధానంగా వస్తున్నా సీక్వెల్ లో హీరోయిజం చూపించే అవకాశం పుష్కలంగా వుంది. గోన గన్నారెడ్డి పాత్రని తిరస్కరించిన వారు సహా ఇతర హీరోల్లో ఎవరు ఈ కథకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.