Begin typing your search above and press return to search.

గుణశేఖర్ గడ్డం కహానీ..

By:  Tupaki Desk   |   10 Oct 2015 11:00 PM IST
గుణశేఖర్ గడ్డం కహానీ..
X
రుద్రమదేవిని ఏళ్ల తరబడి కష్టబడి తీసి ఎట్టకేలకు రిలీజ్ చేశాడు ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ గుణశేఖర్. అయితే... ప్రచారం సమయంలో గుణ గడ్డంతో కనిపించడం కొత్తగా కనిపించింది. సాధారణంగా డైరెక్టర్లకు సెంటిమెంట్స్ ఉంటాయి. కొందరు తలకు స్కార్ఫ్ కట్టుకుని ఉంటారు. కొందరికి సినిమా మొదలుపెట్టాక కంప్లీట్ అయ్యేవరకూ గెడ్డం పెంచడం అలవాటు. మొన్నటికి మొన్న రాజమౌళి కూడా పెద్ద గుబురు గడ్డంతో దర్శనిమిచ్చాడు.

ఇప్పుడు అంత భారీ చిత్రాన్ని తీసిన గుణశేఖర్ గడ్డంతో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఈయన సాధారణంగా ఫుల్ స్టైలిగ్ గా కనిపించే డైరెక్టర్. ఏ విషయంలోనూ తొణకని, బెణకని స్థిరమైన మెంటాలిటీ గుణ సొంతం. మరి ఈయనెందుకు గెడ్డం పెంచాల్సొచ్చింది అని డిస్కస్ చేసుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. రుద్రమ రిలీజ్ కి కష్టాలు ఎదరువతుండడంతో.. ఎవరైనా దేవుడికి మొక్కుకుని ఉంటారని అని కొందరంటున్నారు. పోస్ట్ పోనింగ్ లు, పోస్ట్ ప్రొడక్షన్లతో టెన్షన్ పెరిగిపోయి పాపం గడ్డాన్ని పట్టించుకోవడం మానేశాడని మరికొందరు అంటున్నారు.

రీజన్ ఏదైనా మొత్తానికి మూవీ రిలీజ్ అయింది. ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ అవకపోయినా... నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అయితే రాలేదు. రుద్రమ సేఫ్ జోన్ దాటేయడానికి ఇది చాలు. ఇకనైనా గుణ గెడ్డం తీస్తాడో.. లేక బాహుబలిలో గెడ్డం రాజమౌళి కనిపించినట్లు.. ప్రతాపరుద్రుడిలో ఓసారి మెరుద్దామని పెంచుతాడో ?