Begin typing your search above and press return to search.

ప్రతీకారపు ప్రేమ - ట్రైలర్ టాక్

By:  Tupaki Desk   |   17 July 2019 12:17 PM IST
ప్రతీకారపు ప్రేమ - ట్రైలర్ టాక్
X
ఆరెక్స్ 100 లాంటి సంచలన విజయంతో యూత్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్న కార్తికేయకు హిప్పీ షాక్ ఇచ్చినప్పటికీ త్వరగానే కోలుకుని కొత్త సినిమాతో రాబోతున్నాడు. వచ్చే నెల 2న విడుదల కాబోతున్న గుణ 369 ట్రైలర్ ని ప్రత్యేక అతిధుల సమక్షంలో ఇందాక విడుదల చేశారు. కథను చెప్పీ చెప్పకుండా తెలివిగా కట్ చేశారు.

గుణ(కార్తికేయ)సరదాగా జీవితాన్ని గడిపే యువకుడు. ఓ సెల్ ఫోన్ షాప్ లో పనిచేసే అమ్మాయి(అనఘా)తో ప్రేమలో పడతాడు. స్నేహితుడు(రంగస్థలం మహేష్)తో కలిసి పదే పదే షాప్ కు వెళ్లి రాయబారాలు చేస్తుంటాడు. ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లి దాకా వెళ్తున్న సమయంలో వీళ్ళ జీవితంలోకి గద్దలగుట్ట రాధా(ఆదిత్య మీనన్)వస్తాడు. అది మొదలు గుణ జీవితంలో ఎన్నో ప్రమాదాలు ఎదురవుతాయి. తట్టుకోలేని విషాదం కూడా ఉంటుంది. అసలు రాధా ఎవరు గుణ జైలుకు వెళ్లేంత తప్పు ఏమి చేశాడు వీళ్ళ ప్రేమ కథ ఏ తీరం చేరుకుంది అనేదే మెయిన్ పాయింట్ గా కనిపిస్తోంది

ట్రైలర్ లో విషయం ఉంది. లవ్ స్టోరీగా మొదలుపెట్టి ఆపై యాక్షన్ వైపు మళ్లించిన తీరు ఆసక్తి రేపింది. అర్జున్ జంధ్యాల టేకింగ్ లో గురువు బోయపాటి శీను మార్క్ కన్పిస్తున్నా అన్ని మసాలాలు సరైన రీతిలో వేసుకున్నట్టు కనిపిస్తోంది. రెండు షేడ్స్ లో గుణగా కార్తికేయ సూట్ అయ్యాడు. అనఘా ట్రెడిషనల్ లుక్స్ లో ఆకట్టుకుంది.

ఆదిత్య మీనన్-సీనియర్ నటి మంజుభార్గవిని తప్ప ఇంకెవరిని రివీల్ చేయలేదు. చేతన్ భరద్వాజ్ సంగీతం రామ్ రెడ్డి ఛాయాగ్రహణం ప్లస్ అయ్యాయి. మొత్తానికి తన బాడీ లాంగ్వేజ్ కి కథను ఎంచుకున్న కార్తికేయ గుణ 369 ట్రైలర్ తో ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేశాడు. ఆగస్ట్ 2 రిలీజ్ కానున్న ఈ మూవీ మీద అభిమానుల అంచనాలు బాగానే ఉన్నాయి