Begin typing your search above and press return to search.

గ్యాంగ్ స్ట‌ర్ బెదిరింపుల‌తో స్టార్ హీరోకి గ‌న్ లైసెన్స్?

By:  Tupaki Desk   |   23 July 2022 3:35 AM GMT
గ్యాంగ్ స్ట‌ర్ బెదిరింపుల‌తో స్టార్ హీరోకి గ‌న్ లైసెన్స్?
X
బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ మాఫియా బెదిరింపుల‌తో హైఅలెర్ట్ అయ్యాడు. అత‌డికి అత‌డి కుటుంబానికి ఏ స‌మ‌యంలోనైనా ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భావిస్తున్నారు.

ఇప్ప‌టికే ఖాన్ ని అత‌డి కుటుంబాన్ని ముంబై కాప్ అబ్జ‌ర్వేష‌న్ లో ఉంచారు. ప్ర‌మాద‌క‌ర గ్యాంగ్ స్ట‌ర్స్ చంపేస్తామంటూ హెచ్చ‌రించ‌డంతో హైఅలెర్ట్ క‌నిపిస్తోంది.

తాజా అప్ డేట్ ప్ర‌కారం.. సల్మాన్ ఖాన్ ముంబై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో స్వీయ రక్షణ కోసం తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఖాన్ కి ఇటీవల బెదిరింపు లేఖలు రావ‌డంతో తన వ్యక్తిగత భద్రతను పెంచుకునే ప‌నిలో ఉన్నాడు.

సల్మాన్ ఖాన్ ముంబై CP కార్యాలయంలో స్వీయ రక్షణ కోసం ఆయుధ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే క్ర‌మంలోనే పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ ను మర్యాదపూర్వకంగా సందర్శించారు.

గత నెలలో సల్మాన్ ఖాన్ అతని తండ్రి సలీం ఖాన్ కు మ‌ర్డ‌ర్ చేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. అందులో మేలో కాల్చి చంపబడిన పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా విధిని తండ్రీ-కొడుకులు అనుస‌రిస్తార‌ని హెచ్చ‌రిక ఉంది.

అప్పటి నుంచి పోలీసులు సల్మాన్ కి అత‌డి కుటుంబీకుల‌కు భద్రతను పెంచారు. ముంబై బాంద్రాలో స‌ల్మాన్ కుటుంబం నివాసం ఉంటోంది. అక్క‌డ దాదాపు బాలీవుడ్ ప్ర‌ముఖులంతా నివ‌శిస్తున్నారు. స‌ల్మాన్ గేలాక్సీ అనే అపార్ట్ మెంట్స్ లో నివాసం ఉంటున్నారు.