Begin typing your search above and press return to search.

ఫ్లాప్ రీమేక్ కా రీమేక్ ఫ్లాప్‌

By:  Tupaki Desk   |   9 April 2023 8:30 PM IST
ఫ్లాప్ రీమేక్ కా రీమేక్ ఫ్లాప్‌
X
అరుణ్ విజయ్ హీరోగా తమిళంలో సూపర్‌ హిట్ అయిన తడంకి చిత్రానికి రీమేక్‌ గా తెలుగు లో 'రెడ్‌' అనే టైటిల్ తో ఎనర్జిటిక్ స్టార్‌ రామ్ ఒక సినిమాను చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా నిరాశపరిచింది. రామ్ రెడ్‌ చిత్రం నిరాశ పరిచినా కూడా హిందీలో కాస్త మార్పులు చేర్పులు చేసి రీమేక్ చేశారు. హిందీలో గుంరాహ్‌ గా రూపొంది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తడంకి నిరాశ పరిచింది.

బాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌ హీరోగా నటించగా హీరోయిన్‌ గా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్‌ నటించింది. తెలుగు లో నిరాశ పరిచిన కూడా హిందీలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని వారు భావించారు. కానీ హిందీలో కూడా ఈ సినిమా నిరాశపరిచింది. మొదటి రోజు కనీసం కోటి రూపాయలు వసూళ్లు చేయలేక పోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

తెలుగు లో నిరాశ పరచడం తో మొదటి నుండే హిందీ ఫలితంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమా రూపొందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఎన్నో హిందీ సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటంతో అవాక్కవుతున్నారు.

గుంరాహ్‌ చిత్రం స్క్రీన్ ప్లే విషయంలో కాస్త మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఒరిజినల్ వర్షన్‌ లో మాదిరిగా కాకుండా హీరో ఓవర్‌ యాక్టింగ్‌ మరియు పాత్రల డామినేషన్‌ ఎక్కువ అయింది అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. సోషల్‌ మీడియా లో కూడా ఈ సినిమాపై విమర్శలు వస్తున్నాయి. పాటలు కూడా అస్సలు బాగాలేవు అంటూ విమర్శలు వస్తున్నాయి. రీమేక్ విషయంలో ఉన్న నమ్మకం ను నిలబెట్టుకోలేక పోయారు. మొత్తానికి ఫ్లాప్‌ యొక్క రీమేక్ అనుకున్నట్లుగానే ఫ్లాప్‌ అయిందంటూ కామెంట్స్ వస్తున్నాయి.