Begin typing your search above and press return to search.

ఆర్ద్ర‌త ఆప్యాయ‌త అంటే గుమ్మ‌డిని త‌ల‌వాల్సిందే

By:  Tupaki Desk   |   10 July 2022 10:02 AM IST
ఆర్ద్ర‌త ఆప్యాయ‌త అంటే గుమ్మ‌డిని త‌ల‌వాల్సిందే
X
పాత్ర‌కు ఆర్ధ్ర‌త‌ను అద్ది ఎమోష‌న్ ని ప‌రాకాష్ట‌లో ద‌ట్టించ‌గ‌లిగిన మేటి వెట‌ర‌న్ న‌టుడు గుమ్మ‌డి. ఆయ‌న సుదీర్ఘ‌మైన‌ నట జీవితం గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. 1950 నుండి దాదాపు ఆరు దశాబ్దాల పాటు దాదాపు 500 పైగా చిత్రాల్లో న‌టించిన గుమ్మ‌డి టాలీవుడ్ లో మూడు తరాల తార‌ల‌తో పనిచేశారు. చిన్న వయస్సులో ఉన్నా ఆయ‌న మొదట్లో గౌరవప్రదమైన వృద్ధుల పాత్ర‌ల‌ను పోషించారు. వివిధ పౌరాణిక చిత్రాలలో భీష్మ-దశరథ -బలరామ్ వంటి పాత్ర‌లు అతనికి అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఎన్టీఆర్ - ANR ఇద్దరి కంటే చిన్నవాడు అయినప్పటికీ అతను అనేక చిత్రాలలో వారికి తండ్రిగా నటించారు.

తన సినీ కెరీర్ కు ముందు తెనాలిలో రేడియో దుకాణం నిర్వహించేవాడు. పలువురు ప్రముఖ సాహితీవేత్తలు.. రంగస్థలం చలనచిత్ర ప్రముఖులు సాయంత్రం పూట అతని దుకాణాన్ని సందర్శించి చిట్ చాట్ చేసేవారు. రేడియో దుకాణం సందర్శకులలో ప్రముఖులు నాగి రెడ్డి-చక్రపాణి ద్వయం ప్రముఖ నిర్మాత-రచయిత చక్రపాణి - వెంకట్రామయ్య ఉన్నారు. ఒకప్పుడు ప్రముఖ రంగస్థల కళాకారుడు వెంకట్రామయ్యతో కలిసి గుమ్మ‌డి రంగస్థలంలో నటించడం విశేషం. అతను మామూలుగా హిస్టారియోనిక్ ఫిన్ నెస్ ని జ‌యించి..మధురమైన గొంతుతో మాట్లాడటం గమనించిన వెంకట్రామయ్య సినీరంగంలోకి వెళ్ల‌మ‌ని సూచించాడు.

చక్రపాణి ఓసారి త‌న దుకాణానికి వచ్చినప్పుడు అతనితో పాటు వచ్చిన అతని స్నేహితులలో ఒకరికి సినిమాల్లో నటించే ఆసక్తి ఉందని గుమ్మ‌డి చెప్పారు. లెజెండరీ ఫిల్మ్ మేకర్ వెంకట్రామయ్య చక్రపాణికి సిఫారసు లేఖ ఇవ్వ‌గా గుమ్మడి ఆ లేఖతో మద్రాసు వెళ్లి ఆయనను కలిశాడు. బ్లాక్ బస్టర్ `మిస్సమ్మ`లో అతనికి చాలా చిన్న పాత్ర ఇచ్చారు.

పాత్ర క్లుప్తంగా ఉన్నప్పటికీ అతనికి రూ. 500 పారితోషికం చెల్లించారు. గుమ్మడి స్వతహాగా వంద‌శాతం మ‌న‌సు పెట్టి న‌టించే పూర్తిస్థాయి కళాకారుడు. తన సమకాలీనుడైన SV రంగారావును ఎంతో గౌరవించాడు. పాపుల‌ర్ రచయిత C. నారాయణరెడ్డి త‌న‌ను తెలుగు సినిమాల్లోకి ప్రవేశించేలా ప్రోత్సహించారు. ఎస్వీఆర్ మృతి చెందగానే ఆయన నివాసానికి చేరుకుని చిన్నపిల్లాడిలా కన్నీరుమున్నీరుగా విలపించారు గుమ్మ‌డి. ఆ కాలంలోని తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న గొప్పతనం గురించి ఉటంకిస్తూ.. గుమ్మడి ఒక ఇంటర్వ్యూలో చిత్తూరు వి నాగయ్యకు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో మొట్టమొదటిసారిగా పద్మశ్రీ అవార్డు ఇచ్చిన రోజును గుర్తు చేసుకున్నారు.

``నాగయ్యను అభినందించేందుకు దక్షిణ భారత సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు అత‌డి ఇంటికి చేరుకున్నారు. మేమంతా ఆయన్ను నాన్నా గారు (తండ్రి) అని సంబోధించేవాళ్లం. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు భారత ప్రభుత్వం పద్మ పురస్కారం ఇవ్వాలనుకుంటోందని మొత్తం పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక పెద్దాయనకు ఇవ్వాలని నాన్నగారు సింపుల్ గా చెప్పారు. అందుకే ఆయన ఎంపికయ్యారు. అలా చెబుతూనే నాన్నగారు ఈ అవార్డును ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికీ అంకితం చేశారు’’ అని గుమ్మడి గుర్తు చేసుకున్నారు. తండ్రి.. తాత‌.. పెద‌నాన్న పాత్ర ఏదైనా ఎమోష‌న్ ని ర‌గిలించ‌డం ఫీల్ ని క‌లిగించ‌డంలో గుమ్మ‌డి త‌ర్వాతే. అందుకే ఆయ‌న‌ను తెలుగు సినీప్రేమికులు ఎప్ప‌టికీ మ‌రువ‌లేరు. నేటిత‌రంతో పాటు భావి త‌రాల న‌టుల‌కు అత‌డు స్ఫూర్తి. 9 జూలై 1928 ఆయ‌న జ‌న‌నం.. 26 జ‌న‌వ‌రి 2010 ఆయ‌న అంతిమ‌ సంస్మ‌ర‌ణం.

(నేడు గుమ్మ‌డి జ‌యంతి సంద‌ర్భంగా ఈ స్పెష‌ల్)