Begin typing your search above and press return to search.

గల్లీ రౌడీ రెడీ అయింది: రైటర్ కోన వెంకట్

By:  Tupaki Desk   |   28 Jun 2021 3:30 PM GMT
గల్లీ రౌడీ రెడీ అయింది: రైటర్ కోన వెంకట్
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్థానం అనే బ్లాక్ బస్టర్ మూవీతో కెరీర్ మొదలుపెట్టిన హీరో సందీప్ కిషన్. కెరీర్ ప్రారంభమైన 11ఏళ్లలోనే సందీప్ పాతిక సినిమాలు కంప్లీట్ చేశాడు. నమ్మడానికి సమయం పట్టినా ఇది నిజమే. ప్రస్థానం నుండి ఇప్పటివరకు మధ్యలో హిట్స్ ఫ్లాప్స్ సినిమాలతో సందీప్ కెరీర్ కాస్త ఒడిదుడుకులతోనే నెట్టుకొస్తున్నాడు. అయితే ఇటీవలే తాను నిర్మాతగా మారి 'ఏ1 ఎక్సప్రెస్' అనే సినిమా చేసాడు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో జనాలకు చేరలేదు. కానీ సందీప్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొత్త సినిమాలు లైనప్ చేసేసాడు. ఆల్రెడీ గల్లీ రౌడీ అనే సినిమాను విడుదలకు సిద్ధం చేసాడు.

అయితే ఇండస్ట్రీలో అన్ని అనుకున్నట్లుగా జరగవు అనేది తెలిసిందే. ఒక్కోసారి బాగా బజ్ క్రియేట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతుంటాయి. కొన్ని సినిమాలు బజ్ లేకపోయినా మౌత్ టాక్ తో జనాలను థియేటర్లకు రప్పించుకుంటాయి. ఇవి రెండు కాకుండా మరో మార్గం ఏంటంటే.. ఎంత ఎక్కువ ప్రచారం చేసి జనాల్లోకి తీసుకెళ్తే.. అంత బజ్ క్రియేట్ తో జనాలు కూడా భారీగా రావడం సాధ్యం అవుతుంది. అయితే ఆల్రెడీ గల్లీ రౌడీ విషయంలో మేకర్స్ అదే ఆచరిస్తున్నట్లు అర్ధమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పోస్టర్స్ - టీజర్ లతో పాటు సాంగ్స్ కూడా వదిలారు. ఆ సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేసాయి.

ప్రస్తుతం సినిమా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే తాజాగా ఈ సినిమా ప్రొడ్యూసర్ కం రైటర్ కోన వెంకట్ ట్విట్టర్ వేదికగా.. "ఢీ - రెడీ - గీతాంజలి.. సినిమాలు చూసి ఎంతలా ఈసారి గల్లీ రౌడీని కూడా అంతకంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ ప్లస్ టెన్షన్ కాంబినేషన్ తీసుకొస్తున్నాం. త్వరలోనే మీ ముందుకు రాబోతుంది" అంటూ పోస్ట్ పెట్టి సినిమా కంప్లీట్ అయిందని క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా 2కోట్ల కోసం ఫ్యామిలీ కిడ్నాప్ అనే కాన్సెప్ట్ తో రాబోతుందని టీజర్ చూస్తే అర్ధమైంది. ఇందులో సందీప్ రౌడీగా కనిపించనున్నాడు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎంవివి సత్యనారాయణ నిర్మిస్తున్నాడు. నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. చూడాలి మరి ఆ రేంజి అంచనాలు అందుకుంటుందేమో!