Begin typing your search above and press return to search.

ఇదే సందీప్‌ కిషన్‌ 'గల్లీ రౌడీ' కథ!

By:  Tupaki Desk   |   5 April 2021 4:30 AM GMT
ఇదే సందీప్‌ కిషన్‌ గల్లీ రౌడీ కథ!
X
యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ తాజా చిత్రం 'గల్లీ రౌడీ'. మొదట ఈ సినిమాకు రౌడీ బేబీ అనే టైటిల్‌ ను అనుకున్నారు. కాని దిల్‌ రాజు కోరడంతో ఆ టైటిల్‌ ను కాకుండా తాజాగా 'గల్లీ రౌడీ' అనే టైటిల్‌ ను ఖరారు చేయడం జరిగింది. గల్లీ రౌడీ సినిమా ప్రెస్‌ మీట్‌ తాజాగా జరిగింది. ఆ సందర్బంగా గల్లీ రౌడీ టైటిల్‌ లోగోను ఆవిష్కరించడంతో పాటు ఫస్ట్‌ లుక్‌ ను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంకు వివి వినాయక్‌ మరియు నందిని రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఎంవీవీ సత్య నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాను కోన వెంకట్‌ సమర్పిస్తున్నారు. ఇక ఈ సినిమాకు కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ ఆవిష్కరణ సందర్బంగా హీరో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ.. నా బలం ప్రేక్షకులు. వారు ఏ1 ఎక్స్‌ ప్రెస్‌ కు అందించిన విజయం వల్లే ఇక్కడ ఉన్నాను. ఆ సినిమా సక్సెస్‌ సమయంలో ఒక మంచి హ్యాపీ మూవీ చిత్రం చేయాలని కోరుకున్నాను. ఆ సమయంలోనే ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా లో నన్ను నాకే కొత్తగా కనిపించేలా దర్శకులు చూపిస్తున్నారు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే మా తాత రౌడీ, మా నాన్న రౌడీ. కాని నాకు రౌడీ కావడం ఇష్టం లేదు. రౌడీయిజంకు దూరంగా ఉండాలనుకుంటాను. అలాంటి నన్ను స్కూల్‌ నుండి తీసుకు వచ్చి బలవంతంగా నాతో రౌడీయిజం చేయించాలని ప్రయత్నిస్తారు. ఇక రాజేంద్ర ప్రసాద్‌ ఒక భయస్తుడైన పోలీసుగా కనిపించబోతున్నాడు అంటూ సినిమా కథను హీరో సందీప్‌ రివీల్‌ చేశాడు. సినిమా తప్పకుండా అందరిని ఆకట్టుకునేలా ఒక మంచి ఎంటర్‌ టైన్‌ మెంట్‌ అందించే సినిమా గా నిలుస్తుందనే నమ్మకంను మేకర్స్‌ వ్యక్తం చేశారు.