Begin typing your search above and press return to search.

ధారావి స్ల‌మ్ డాగ్ స‌క్సెస్ జ‌ర్నీ క‌థ‌

By:  Tupaki Desk   |   14 Feb 2019 10:25 AM GMT
ధారావి స్ల‌మ్ డాగ్ స‌క్సెస్ జ‌ర్నీ క‌థ‌
X
ఒక ఫిలింన‌గ‌ర్ స్ల‌మ్‌ లో.. ఒక ధారావి స్ల‌మ్ లో నివ‌శించే కుర్రాడు ర్యాప‌ర్ (సింగ‌ర్ కం డ్యాన్స‌ర్) కావాల‌ని క‌ల‌గంటే.. పేద‌రికం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని ప్ర‌య‌త్నిస్తే... త‌న‌ క‌ల‌ల్ని నిజం చేసుకునేందుకు పోరాటం సాగిస్తే.. ఈ క‌థ‌లోనే ఒక అంద‌మైన అమ్మాయితో ల‌వ్ స్టోరి ప్ర‌వేశిస్తే.. ఇలాంటి క‌థ‌లు కొత్తేమీ కాదు కానీ, ఇంత వెయిట్ ఉన్న స‌బ్జెక్ట్ ని కొత్త‌గా చూపించ‌గ‌లిగడంలో ద‌ర్శ‌కులు ఎంత వ‌ర‌కూ స‌క్సెస‌య్యారు? అన్న‌ది మాత్రం ఇంపార్టెంట్. నిరంత‌రం జిగిబిగితో అట్టుడికించే ర్యాప‌ర్ క‌థ‌లో ప్ర‌తి ఫ్రేములో ఎగ్జ‌యిట్ మెంట్ పెంచ‌డానికి ఉన్న అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో ద‌ర్శ‌కులు స‌క్సెసైతే వ‌చ్చే ఔట్ పుట్ వేరేగా ఉంటుంది. తాజాగా రిలీజైన `గ‌ల్లీ బోయ్‌` చిత్రానికి అలాంటి ప్ర‌శంస‌లే విమ‌ర్శ‌కుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

ప్రేమికుల దినోత్స‌వం కానుక‌గా నేడు ర‌ణ‌వీర్ - ఆలియాల‌ `గ‌ల్లీ బోయ్‌` రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై జాతీయ మీడియా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తోంది. ద‌ర్శ‌కురాలు జోయా అక్త‌ర్ ఎంచుకున్న క‌థాంశం ఓ హైలైట్... తెర‌కెక్కించిన విధానం అద్భుతంగా ఉంద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఒక ర్యాప‌ర్ నిజ‌జీవిత క‌థ హైలైట్ గా తెర‌పై ఆవిష్క‌రించారు అన్న ప్ర‌శంస‌ల్ని స‌మీక్ష‌కులు కురిపించారు. ఈ చిత్రంలో ర్యాప‌ర్ పాత్ర‌లో ర‌ణ‌వీర్ జీవించాడ‌ని, ఆలియా క్యూట్ అప్పియ‌రెన్స్ సినిమాకి పెద్ద ప్ల‌స్ అయ్యింద‌ని స‌మీక్ష‌కులు విశ్లేషించారు. ప్ర‌ఖ్యాత మిడ్ డే ఈ చిత్రానికి 4/5 రేటింగ్ ఇస్తే.. ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ 3.5/5 , టైమ్స్ ఆఫ్ ఇండియా 4/5 రేటింగ్ ఇవ్వ‌డం విశేషం. న‌ట‌న‌, ద‌ర్శ‌క‌త్వం- డైలాగ్స్- స్క్రీన్ ప్లే- మ్యూజిక్- విజువ‌ల్స్ ఇలా అన్నిటికీ సెంట్ ప‌ర్సంట్ మార్కులే వేశారు స‌మీక్ష‌కులు. ట్రైల‌ర్ లో గ‌ల్లీ కుర్రాళ్ల బూతుల్ని డైలాగుల్లో య‌థావిధిగా చూపించార‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా సెన్సార్ వాట‌న్నిటికీ క‌ట్స్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఈ చిత్రం ఓ చ‌క్క‌ని యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ అన్న ప్ర‌శంస‌లు ద‌క్కించ‌కుంది.

ర‌ణ‌వీర్ వ‌రుస విజ‌యాల‌తో బాలీవుడ్ టాప్ స్టార్ గా ఎదిగేశాడు. ఇటీవ‌లే `సింబా` గ్రాండ్ స‌క్సెస్‌తో దూకుడుమీదున్న ర‌ణ‌వీర్ ఆ వెంట‌నే `గ‌ల్లీ బోయ్స్ తో పాజిటివ్ టాక్ అందుకోవ‌డం ఆస‌క్తిక‌రం. ఇదే దూకుడులో త‌దుప‌రి క‌ర‌ణ్ జోహార్ `త‌క్త్` చిత్రంలో న‌టించ‌నున్నాడు. సింహాస‌నం కోసం కుమ్ములాడుకునే అన్న‌ద‌మ్ముల క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. మ‌రోవైపు ర‌ణ‌వీర్ వ్య‌క్తిగ‌త జీవితంలోనూ ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌న ప్రియురాలు దీపిక‌ను పెళ్లాడి సెల‌బ్రేష‌న్ మూడ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే.