Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: అలాగే ఉంది ప్రభూ..
By: Tupaki Desk | 16 March 2018 12:45 PM ISTఇండియన్ మైకేల్ జాక్సన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవ అంటే చాలా మంది డ్యాన్సర్లకు స్ఫూర్తి. ఇండియాకి కొత్త తరహా స్టెప్పులను తీసుకోవచ్చిన వారిలో ఆయన ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరియోగ్రాఫర్ గానే కాకుండా హీరోగా అలాగే దర్శకుడిగా తన టాలెంట్ ను చూపించాడు. గత కొంత కాలంగా దర్శకుడిగా నార్త్ లో సినిమాలను తీస్తూ సౌత్ లో మాత్రం హీరోగా చేస్తున్నాడు.
తమిళ్ లో ఈ మధ్య గులేబకావలి అనే సినిమాలో హీరోగా నటించాడు ప్రభుదేవా. గత జనవరిలో కోలీవుడ్ లో రిలీజ్ అయిన ఆ సినిమా పరవలేదు అనే విధంగా మంచి కలెక్షన్స్ ని అందుకుంది. అయితే ఇప్పుడు అదే పేరుతో తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. సినిమాలో గట్టిగా తమిళ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా కొంచెం రెగ్యులర్ కామెడీ టచ్ అయ్యింది.
కాకపోతే ప్రభుదేవా స్పీడ్ డ్యాన్సులు టైమింగ్ కామెడీ నచ్చవచ్చు అనే టాక్ బాగానే వస్తోంది. అంతే కాకుండా సాంగ్స్ కోసం విజువల్ ఎఫెక్ట్స్ ని కూడా వాడినట్లు అర్ధమవుతోంది. ఎంతగా ఖర్చుపెట్టారో గాని సినిమా పై అనుకున్నంత రేంజ్ లో అంచనాలు లేవు. పైగా ఈ ట్రైలర్ చూస్తే.. మనోడి పాత సినిమాల తరహాలోనే ఉంది. బహుశా టాక్ బావుంటే సినిమాకి కలెక్షన్స్ బాగానే వస్తాయి. ఇక ప్రభుదేవా సరసన హన్సిక నటించింది. ఆమె గ్లామర్ సినిమాకు ప్లస్ కావచ్చు. మరి ఇండియన్ మైకేల్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి.
ట్రైలర్ కోసం క్లిక్ చేయండి
