Begin typing your search above and press return to search.

గాల్లో ఎగిరిపోతున్న గుల్ పనాగ్

By:  Tupaki Desk   |   15 Nov 2016 4:13 PM GMT
గాల్లో ఎగిరిపోతున్న గుల్ పనాగ్
X
బాలీవుడ్ బ్యూటీ గుల్ పనాగ్ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. కెరీర్ చివర్లో పాలిటిక్స్ ఎంట్రీ ఇచ్చేవారు.. వయసు ముదిరాక దారి మార్చుకునే హీరోయిన్లు చాలామందే ఉంటారు. కానీ గుల్ పనాగ్ మాత్రం జనాలకు షాకులు ఇస్తూనే ఉంది. కెరీర్ బాగున్నపుడే థర్టీస్ లో రాజకీయాల్లోకి చేరిపోయిన ఈమె.. ఇప్పుడు మరో ఘనత కూడా సాధించేసింది.

ఇప్పుడీమె పైలెట్ కూడా అయిపోతోంది. ఇదేదో సినిమా కేరక్టర్ అనుకునేరు! ఈ భామకు రియల్ గానే పైలెట్ లైసెన్స్ వచ్చేసింది. దీంతో పైలెట్ యూనిఫాంలో మిని ప్లేన్ పక్కన నుంచుని ఫోటోలు తీయించుకుని.. వాటిని సోషల్ మీడియాలో పెట్టేసింది. ఫ్లైట్ పక్కన నుంచుని గాల్లో ఎగిరిపోతున్న ఫోటో చూస్తే.. ఫ్లైట్ ఎక్కుకుండానే ఆనందంతో ఎగిరిపోతోందన్న విషయం అర్ధమవుతోంది.

మిస్ ఇండియా దగ్గర నుంచి మొదలు పెట్టి.. మోడల్ గా మారి.. ఆర్టిస్ట్ గా ఎదిగి.. పొలిటీషియన్ గా రూపాంతరం చెంది.. ఇప్పుడు పైలెట్ వరకూ వచ్చేసిందంటే.. అసలు ఈ 37 సంవత్సరాల వయసు గల గుల్ పనాగ్ సాధించలేనిది ఏదీ లేదేమో అనిపిస్తోంది కదూ!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/