Begin typing your search above and press return to search.

షూటింగ్ మార్గదర్శకాలు కష్టమే సుమీ!

By:  Tupaki Desk   |   7 Jun 2020 7:00 AM IST
షూటింగ్ మార్గదర్శకాలు కష్టమే సుమీ!
X
త్వరలో సినిమా షూటింగులకు అనుమతులిచ్చేందుకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే షూటింగులలో ఫిలింమేకర్లు అనుసరించాల్సిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం రెడీ చేస్తోందని సమాచారం. ఎలాంటి మార్గదర్శకాలు రాబోతున్నాయి అనే విషయంలో ఫిలిం నగర్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఈ గైడ్ లైన్స్ విడుదల చెయ్యాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు.

అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.

*షూటింగులకు పరిమిత సంఖ్యలో సిబ్బంది(50 కంటే తక్కువమంది).
*షూటింగ్ లోకేషన్లలో 60 ఏళ్ళకు పైబడిన యాక్టర్లకు.. ఇతరులకు అనుమతి లేదు.
*సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాలి.
*శానిటైజేషన్ పాయింట్లు ఏర్పాటు చెయ్యాలి.
*ప్రతి షాట్ తర్వాత నటీ నటులు, ఇతర సిబ్బంది తమ చేతులను శానిటైజర్ తో శుభ్రపరుచుకోవాలి.
*ఆహారం ఇంటి నుంచి తెచ్చుకోవాలి. బఫేలు విందులకు అనుమతి లేదు.
*కౌగిలింతలకు, ముద్దులకు, ఫైట్ సీన్లకు ప్రస్తుతానికి అనుమతి లేదు.
*సిబ్బందిలో ఎవరైనా మహమ్మారి బారిన పడితే ఆ వ్యక్తికి వైద్యం చేయించాల్సిన బాధ్యత నిర్మాతదే.

ఇలాంటి మార్గదర్శకాలను నిజంగానే జారీ చేస్తారో లేదో కానీ ఇవి ఫాలో కావడం చాలా కష్టమనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. వీటితో నిర్మాతలకు ఖర్చు పెరిగి పోతుందని.. రిస్క్ ఎక్కువ అవుతుందని అంటున్నారు.. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.