Begin typing your search above and press return to search.

భర్త సినిమాలో గెస్ట్‌ రోల్‌

By:  Tupaki Desk   |   20 Feb 2021 9:00 PM IST
భర్త సినిమాలో గెస్ట్‌ రోల్‌
X
బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రణ్వీర్‌ సింగ్‌ మరియు దీపిక పదుకునే జోడీ కి అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు. వారు కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరు కలిసి నటించిన 83 విడుదలకు సిద్దంగా ఉంది. మరో వైపు రణ్వీర్‌ సింగ్‌ హీరోగా రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ మూవీలో దీపిక పదుకునే కీలక మైన గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

సర్కస్‌ టైటిల్‌ తో రూపొందుతున్న ఈ సినిమా లో రణ్వీర్‌ సింగ్ కు జోడీగా పూజా హెగ్డే మరియు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ లు హీరోయిన్‌ లుగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా లో కీలకమైన పాత్రను దీపిక పదుకునేతో చేయిస్తే సినిమా రేంజ్ పెరగడంతో పాటు అభిమానుల దృష్టిని ఆకర్షించి సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కుతుందనే ఉద్దేశ్యంతో దర్శకుడు రోహిత్‌ శెట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. రణ్వీర్‌ మరియు దీపికల కాంబోలో రొమాంటిక్‌ సీన్స్‌ ఉంటాయా లేదా సంబంధం లేకుండానే దీపిక ఈ సినిమాలో కనిపించబోతుందా అనేది తెలియాల్సి ఉంది.