Begin typing your search above and press return to search.

బావ బావ ప‌న్నీరు.. బావ‌ను ప‌ట్టుకు త‌న్నేరు!

By:  Tupaki Desk   |   10 March 2019 5:39 AM GMT
బావ బావ ప‌న్నీరు.. బావ‌ను ప‌ట్టుకు త‌న్నేరు!
X
బావ బావ ప‌న్నీరు.. బావ‌ను ప‌ట్టుకు త‌న్నేరు!
వీధి వీధి తిప్పేరు.. ఈసెడు బెల్లం కుమ్మారు!!
.. ప‌ల్లె ప‌ట్టు ప‌రిస‌రాల్లో జాన‌ప‌దులు పాడుకునే పాట ఇది. ఇలాంటివి దేవీశ్రీ‌కి చిక్కాలే కానీ అస్స‌లు వ‌దిలిపెట్ట‌డు. బ్లాక్ బ‌స్ట‌ర్ `పాట‌`గా రాక్ స్టార్ స్వ‌రానికి చిక్కాల్సిందే!! కానీ ఇదిగో ఇక్క‌డ కాంతం అలియాస్ సూర్య కాంతం బావ‌ను ఆట ప‌ట్టిస్తోంది. ఈయ‌నెవ‌రు? అంటూ ఫ‌జిల్ వేసిన కాంతం.. బావ బావ ప‌న్నీరు! అంటూ అస‌లు క్లూ లీక్ చేయ‌డంతో ఆ బావ గారు ఎవ‌రో అంద‌రికీ ఇట్టే తెలిసిపోయింది.

ఆ క‌ళ్ల‌లో `చురుకు`ను ఇట్టే గుర్తు ప‌ట్టేశారు అభిమానులు. ఈ బావ ఇంకెవ‌రు? మా బావ‌గారు సాయిధ‌ర‌మ్ తేజ్!! అంటూ అభిమానులు వెంట‌నే చెప్పేశారు. `కాంతంతో సీనియర్ పంజా` అన్న ట్యాగ్ లైన్ కూడా గ‌మ్మ‌త్తుగానే వ‌ర్క‌వుటైంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కి సిస‌లైన వార‌సుడిగా సాయిధ‌ర‌మ్ గురించి మెగా కాంపౌండ్ అభివ‌ర్ణిస్తుంటుంది. అత‌డిలోని చురుకైన డ్యాన్సింగ్ స్టైల్ చిరు స్టైల్ ని పోలి ఉంటుంది. వ్య‌క్తిత్వంలో ప‌వ‌ర్ స్టార్ లా ఎంతో డౌన్ టు ఎర్త్ ఉంటార‌ని చెబుతుంటారు.

మార్చి 29న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌చారంలో వేగం పెంచారు. ప్ర‌స్తుతం మ‌ర‌ద‌లు పిల్ల న‌టించిన `సూర్య‌కాంతం` సినిమా ప్ర‌మోష‌న్ బాధ్య‌త‌ను సాయిద‌ర‌మ్‌ తీసుకున్నాడు. నిహారిక కొణిదెల టైటిల్ పాత్ర పోషిస్తున్న సూర్య‌కాంతం టీజ‌ర్, పోస్ట‌ర్ స‌హా ప్ర‌తిదీ ఉత్కంఠ‌ను పెంచాయి. కొత్త ద‌ర్శ‌కుడు ప్ర‌ణీత్ ని ఎంక‌రేజ్ చేస్తూ.. నీహా అన్న‌గారు.. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఈ చిత్రాన్ని స్వ‌యంగా స‌మ‌ర్పిస్తున్నారు. రాహుల్ విజ‌య్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా, సుహాసిని మ‌ణిర‌త్నం ఓ కీలక పాత్ర‌లో న‌టించారు. నిర్వాణ సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది.