Begin typing your search above and press return to search.

గూఢచారి ఇంకెన్నాళ్లు దాక్కుంటాడో!!

By:  Tupaki Desk   |   15 Jun 2018 3:51 AM GMT
గూఢచారి ఇంకెన్నాళ్లు దాక్కుంటాడో!!
X
ఎవరూ ఊహించని విధంగా క్షణం సినిమాతో సోలో హీరోగా సూపర్ హిట్ కొట్టాడు అడవి శేష్. అంతవరకు క్యారెక్టర్ నటుడిగా పేరు తెచ్చుకున్న అడవి శేష్ లో మంచి హీరో కూడా ఉన్నాడని ఆ మూవీ ప్రూవ్ చేసింది. పర్ ఫెక్ట్ స్క్రీన్ ప్లే.. ఇంట్రస్టింగ్ స్టోరీ తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

క్షణం తరవాత అడవి శేష్ గూఢచారి అనే సినిమా స్టార్ట్ చేశాడు. పేరులోనే చెప్పిన విధంగా ఇదో స్పై థ్రిల్లర్. ఈ సినిమా మొదలెట్టి చాలా రోజులే అయింది. ఈ మూవీ షూటింగ్ ఇండియాతో పాటు బంగ్లాదేశ్.. అమెరికాలోనూ చేశారు. అసలు ముందుగా అనుకున్న ప్రకారమైతే గూఢచారి మూవీ ఈ ఏడాది సంక్రాంతికే థియేటర్లకు రావాల్సి ఉంది. కానీ అనుకోని విధంగా సినిమా రిలీజ్ వెనక్కి వెళ్లిపోయింది. సమ్మర్ నాటికి వస్తుందంటూ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. అదీ వర్కవుట్ అవలేదు. ఇప్పటికి సినిమా షూటింగ్ పూర్తయిందని ఫిలిం మేకర్లు చెబుతున్నారు. కానీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా లాక్ చేయలేదు.

కొత్త డైరెక్టర్ శశి కిరణ్ తిక్క గూఢచారి మూవీకి దర్శకత్వం వహించాడు. అందాల పోటీల్లో వెలుగులోకి వచ్చిన తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ల ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. హీరో నాగార్జున మేనకోడలు... పవన్ కళ్యాణ్ మొదటిసినిమా అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయిలో హీరోయిన్ గా కనిపించిన సుప్రియ ఓ ఇంపార్టెంట్ రోల్ చేసింది.