Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ కి పెరుగుతున్న మద్దతు

By:  Tupaki Desk   |   18 Aug 2022 8:30 AM GMT
సూపర్ స్టార్ కి పెరుగుతున్న మద్దతు
X
బాలీవుడ్ సూపర్ స్టార్‌ ఆమీర్ ఖాన్‌ తాజా చిత్రం లాల్ సింగ్ చడ్డా ను బ్యాన్ చేయాలంటూ జరిగిన ప్రచారం ఆ సినిమాకు చాలా డ్యామేజీ క్రియేట్‌ చేసింది. సినిమా కు నెగటివ్ టాక్ వచ్చినా కూడా గతంలో మినిమం గా వసూళ్లు నమోదు అయ్యేవి. కాని ఇప్పుడు లాల్ సింగ్ చడ్డా సినిమా ఒక చిన్న సినిమా స్థాయిలో కూడా వసూళ్లను దక్కించుకోలేక పోయింది అంటూ బాలీవుడ్ బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు.

ఆమీర్ ఖాన్‌ సినిమాలను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం లాల్‌ సింగ్ చడ్డా పై తీవ్రంగా పడింది. ఆమీర్ ఖాన్ దేశ ద్రోహి అంటూ కొందరు చేస్తున్న ప్రచారం ఆయన రాబోయే సినిమాలపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో ఆమీర్ ఖాన్ కి మద్దతు కూడా పెరుగుతోంది.

లాల్ సింగ్ చడ్డా సినిమాని చూసిన హృతిక్‌ రోషన్ బాగుందంటూ ట్వీట్‌ చేసి ఆ సినిమాకు మద్దతుగా నిలిచిన విషయం తెల్సిందే. హృతిక్‌ రోషన్ తో పాటు యంగ్‌ హీరో అర్జున్ కపూర్ కూడా ఆమీర్ ఖాన్‌ కి మద్దతుగా నిలిచాడు.

ఇప్పుడు లేడీ హీరోయిన్‌ ఏక్తా కపూర్ కూడా ఆమీర్ ఖాన్‌ కు మద్దతు తెలిపింది. ఆయన త్వరలోనే పూర్వ వైభవం ను దక్కించుకుంటాడనే నమ్మకం వ్యక్తం చేసింది.

ఆమీర్ ఖాన్ తదుపరి సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకుని పూర్వ వైభవం దక్కించుకుంటాడు అన్నట్లుగా పేర్కొంది. ఆమీర్‌ ఖాన్‌ కు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరి సినిమాలను కూడా బ్యాన్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు.

హృతిక్‌ రోషన్ సినిమా విక్రమ్‌ వేదాని బ్యాన్ చేయాలంటూ పిలుపునివ్వడంతో పాటు ఆమీర్ ఖాన్‌ కు మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి అంటూ నెటిజన్స్‌ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏక్తా కపూర్ కూడా ఆమీర్ కు మద్దతు తెలపడం తో బ్యాన్ బ్యాచ్ ఏం చేయబోతుంది అనేది చూడాలి.