Begin typing your search above and press return to search.

#గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. రోజావనంలో యాంకర్ రష్మి

By:  Tupaki Desk   |   7 March 2020 6:26 AM GMT
#గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. రోజావనంలో యాంకర్ రష్మి
X
మొక్క మానవాళికి జీవనాధారం.. ప్రతీ ఇంటికి ఐదు మొక్కలు నాటుదాం.. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా మార్చుదామని పిలుపుతో ఏపీఐసీసీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే రోజా ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నారం. రోజావనం పేరిట మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా #GreenIndiaChallenge చాలెంజ్ పలువురికి విసురుతున్నారు. కొందరికి నామినేట్ చేస్తూ వారితో స్వయంగా మొక్కలు నాటిస్తున్నారు. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ను గతంలో స్వీకరించి రోజా తన నగరి నియోజకవర్గంలోని పుత్తూరు ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 30 మొక్కలు నాటారు. ఆ తర్వాత ఆ చాలెంజ్ ను ఆమె సవాల్ గా తీసుకుని ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

అందులో భాగంగానే ఆమె ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, యాంకర్ రేష్మీకు గ్రీన్ చాలెంజ్ ఇచ్చారు. ఆమె పిలుపునకు స్పందించి ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి గతంలోనే మొక్కలు నాటారు. ఈ చాలెంజ్ లో భాగంగా రోజా ప్రత్యేక చొరవతో కొందరితో స్వయంగా మొక్కలు నాటిస్తున్నారు. ఇటీవల సినీ నటుడు అర్జున్, సినీ నటి కుష్బూతో మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా వారితో పలువురిని నామినేట్ చేశారు. రోజా "రోజావనం" పేరిట ఈ కార్యక్రమం చేపడుతున్నారు. అందులో భాగంగా తాజాగా యాంకర్ రష్మితో మొక్కలు నాటించారు. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో రష్మితో రోజా మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా మొక్కల ప్రాధాన్యం వివరిస్తూ అందరూ మొక్కలు నాటించడానికి ముందుకు రావాలని రోజా, రష్మి పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా గ్రీన్ చాలెంజ్ ను నటుడు సత్యదేవ్, యాంకర్, నటి అనసూయ, డ్యాన్స్ మాస్టర్ శేఖర్ కు రష్మి సవాల్ విసిరారు. మరి రోజవనం పేరిట మొదలైన ఈ గ్రీన్ ఇండియా ఉద్యమం ముందుకువెళ్లాలని ఆకాంక్షిద్దాం. మీరు

కూడా మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి అని రోజా పిలుపునిస్తున్నారు.