Begin typing your search above and press return to search.

పొద్దున్నే గ్రీన్ టీ.. నైటైతే 90

By:  Tupaki Desk   |   30 April 2022 8:30 AM GMT
పొద్దున్నే గ్రీన్ టీ.. నైటైతే 90
X
రైట‌ర్ లు.. యాక్ట‌ర్ లుగా మారుతున్నారు. యాక్ట‌ర్ లు సింగ‌ర్ లు అవుతున్నారు. ఈ జాబితాలో మ‌రో న‌టుడు చేరాడు. ఆయ‌నే పోసాని కృష్ణ ముర‌ళి. ఇటీవ‌ల ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ ప్ర‌త్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి సంచ‌ల‌నం సృష్టిచిన పోసాని ఆ త‌రువాత మ‌రెక్క‌డా క‌నిపించ‌లేదు. చాలా వ‌ర‌కు సైలెంట్ అయిపోయారు. కొంత విరామం త‌రువాత ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ను ఇండ‌స్ట్రీ త‌రుపున టికెట్ రేట్ల విష‌య‌మై చ‌ర్చించ‌డానికి మెగాస్టార్ చిరంజీవి, మ‌హేష్ బాబు, ప్ర‌భాస్‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, ఆర్. నారాయ‌ణ‌మూర్తి, అలీ ఆహ్వానం మేర‌కు అమ‌రావ‌తి వెళ్లి ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు.

ఈ ప్ర‌త్యేక భేటీ లో పోసాని కృష్ణ ముర‌ళి స‌డ‌న్ గా ప్ర‌త్య‌క్ష‌మై షాకిచ్చిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత మ‌ళ్లీ ఆయ‌న ఏ వేదిక‌పై కూడా క‌నిపించ‌లేదు. ప్ర‌త్యేకంగా మీడియా మీట్ ల‌ని కూడా నిర్వ‌హించ‌లేదు. చాలా రోజులుగా మీడియా ముందుకు రాకుండా సైలెంట్ గా వుంటున్న ఆయ‌న తాజాగా మ‌ళ్లీ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. అయితే ఈ సారి ఓ సినిమా కోసం కావ‌డం విశేషం. రైట‌ర్‌, యాక్ట‌ర్ గా ఆక‌ట్టుకున్న పోసాని ఇప్ప‌డు శ్రీ‌విష్ణు సినిమా కోసం తొలిసారి సింగ‌ర్ గా కొత్త అవ‌తారం ఎత్తారు.

శ్రీ‌విష్ణు హీరోగా న‌టించిన తాజా చిత్రం 'భ‌ళా తంద‌నాన‌'. చైత‌న్య దంతులూరి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. కేథ‌రిన్ క‌థ‌నాయిక‌గా న‌టించింది. వారాహి చ‌త‌న చిత్రం.. సాయి కొర్ర‌పాటి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ర‌జ‌నీ కొర్ర‌పాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇప్ప‌టికే రెండే మూడు సార్లు రిలీజ్ వాయిదా ప‌డిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు మే 6న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ముందు ఏప్రిల్ 30న రిలీజ్ చేయాల‌ని డేట్ ప్ర‌క‌టించిన అంతా సిద్ధం చేసుకున్న టీమ్ ఏప్రిల్ 29న 'ఆచార్య‌' రిలీజ్ కావ‌డంతో మ‌ళ్లీ వెన‌క్కి త‌గ్గింది.

చివ‌రికి ఫైన‌ల్ గా మే 6న వ‌స్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే టీజ‌ర్ తో ఆక‌ట్టుకున్న ఈ మూవీకి సంబంధించిన గ్రీన్ టీ అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని చిత్ర బృందం శ‌నివారం విడుద‌ల చేసింది. మణిశ‌ర్మ సంగీతం అందించిన ఈ గీతాన్ని పోసాని కృష్ణ ముర‌ళీ ఆల‌పించ‌డ‌మే కాకుండా ఈ పాట‌కు అదిరిపోయే స్టెప్పులేశాడు. కాస‌ర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాట‌ని పోసానితో క‌లిసి పృథ్వీ చంద్ర‌, హారికా నారాయ‌ణ్ ఆల‌పించారు.

'బ్రోచేవారెవ‌రురా', రాజ రాజ‌చోర వంటి చిత్రాల‌తో మంచి విజ‌యాల్ని సొంతం చేసుకున్న శ్రీ‌విష్ణు ఈ సినిమా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవ‌ల త‌ను చేసిన త‌ప్పరా మీసం, అర్జున ఫ‌ల్గుణ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాకొట్టేశాయి. దీంతో శ్రీ‌విష్ణు కు ఈ సినిమా హిట్ త‌ప్ప‌నిస‌రిగా మారింది. ఇక ద‌ర్శ‌కుడు చైత‌న్య దంతులూరికి కూడా ఈ మూవీ విజ‌యం చాలా కీల‌కంగా మార‌బోతోంది. 'బాణం' త‌రువాత అత‌నికి ఆ స్థాయిలో హిట్ లేదు. దీంతో ఈ ఇద్ద‌రూ ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.