Begin typing your search above and press return to search.

బిగ్ బి అమితాబ్ లెగ‌సీని న‌డిపించే వార‌సుడొచ్చాడు

By:  Tupaki Desk   |   19 April 2022 3:28 AM GMT
బిగ్ బి అమితాబ్ లెగ‌సీని న‌డిపించే వార‌సుడొచ్చాడు
X
ప‌రిశ్ర‌మ‌లో అగ్ర హీరోల వార‌సులు అయినా కానీ నిల‌దొక్కుకోవాలంటే ప్ర‌తిభ ల‌క్ చాలా అవ‌స‌రం. రంగుల మాయా ప్ర‌పంచంలో ఇప్ప‌టికే ఎందరో బ‌డా స్టార్ల వార‌సులు ఎందుకూ కొర‌గాని వారిగా మిగిలిపోయారు. త‌మ‌ను తాము నిరూపించుకునేందుకు ద‌శాబ్ధాల పాటు పోరాడిన వారు ఉన్నారు. ఇక‌పోతే బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ స్టార్ డ‌మ్ గురించి తెలిసిందే. ఆయ‌న వార‌సుడిగా రంగ ప్ర‌వేశం చేసిన అభిషేక్ బ‌చ్చ‌న్ తీవ్రంగా నిరాశప‌రిచారు. తండ్రిని మించిన త‌న‌యుడు అని నిరూపించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. స‌మ‌కాలీన స్టార్ల‌తో పోటీప‌డుతూ అభిషేక్ బ‌చ్చ‌న్ బిగ్ బి లెగ‌సీని కాపాడుతార‌ని ముందుకు న‌డిపిస్తాడ‌ని అభిమానులు ఆకాంక్షించినా కానీ అది జ‌ర‌గ‌లేదు.

అయితే ఇప్పుడు బిగ్ బి అమితాబ్ లెగ‌సీని ముందుకు న‌డిపించే సిస‌లైన వార‌సుడు బ‌రిలో దిగుతున్నాడ‌ని బాలీవుడ్ మీడియాలో గుస‌గుస వినిపిస్తోంది. అమితాబ్ మ‌న‌వ‌డు.. కూతురు శ్వేతాబ‌చ్చ‌న్ నందా కుమారుడు అగ‌స్త్య నందా సినీఆరంగేట్రం చేస్తున్నాడు. హీరోగా స‌త్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.

దీంతో బిగ్ బి అభిమానుల్లో బోలెడంత సంద‌డి నెల‌కొంది. తాజాగా అభిమానులు రూపొందించిన‌ కోల్లెజ్ ను పంచుకుంటూ అగస్త్యను అంద‌రూ ఆశీర్వ‌దించాల‌ని అమితాబ్ బచ్చన్ కోరారు. ''అగస్త్య.. నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోంది. అంతకు మించిన సంతోషం మనందరిలో ఏదీ లేదు.. నా ఆశీస్సులు నా ప్రేమ ఉన్నాయి. శుభాకాంక్షలు.. బాగా చేయండి.. జెండాను ఎగురవేయండి'' అని ట్వీట్ లో అమితాబ్ రాశారు. దీంతో అగ‌స్త్య నందా హీరోగా ఆరంగేట్రం చేస్తున్నార‌ని అధికారిక ప్ర‌క‌ట‌న విడులైన‌ట్టే.

సోమవారం ఉదయం అత‌డు న‌టించే చిత్రాన్ని ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కురాలు జోయా అక్తర్ ప్రకటించారు. ఒక ఫోటోని షేర్ చేసిన జోయా..''బ్యాక్ టు ది ఫ్యూచర్'' అని రాశారు. ఈ పోస్ట్ కు అభిషేక్ బచ్చన్- దియా మీర్జా- కరణ్ జోహార్- అనన్య పాండే- జాన్వీ కపూర్ ల నుండి అద్భుత‌ స్పందన ల‌భించింది. తారాగణం గురించి అధికారికంగా ప్రకటించక‌పోయినా కానీ.. సుహానా వెరోనికా లాడ్జ్ గా కనిపిస్తారని... ఖుషీ - అగస్త్య వరుసగా బెట్టీ కూపర్ .. ఆర్చీ ఆండ్రూస్ గా కనిపిస్తారని క‌థ‌నాలొస్తున్నాయి.

ఈ ముగ్గురూ మార్చిలో సెట్ లో కనిపించారు. కాస్ట్యూమ్ ట్రయల్ షూట్ లో పాల్గొన్నారు. ఇప్పుడు అధికారికంగా సినిమా ప్రారంభమైంది. శ్వేతా బ‌చ్చ‌న్ నందా- నిఖిల్ నందాల వార‌సుడు అగ‌స్త్య నందా.. తాత అమితాబ్ రేంజులో రాణించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. బిగ్ బి లెగ‌సీని మ‌న‌వ‌డు ముందుకు న‌డిపించాల‌న్న‌ది ఆకాంక్ష‌. ఇక అగ‌స్త్య స్మార్ట్ లుక్ కి ఇప్ప‌టికే గాళ్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

ఇండ‌స్ట్రీకి మ‌రో క్యూట్ స్మార్ట్ బోయ్ దొరికాడు. ఇంత‌కుముందు అమితాబ్ తో అగ‌స్త్య జిమ్ లో వ‌ర్క‌వుట్లు చేస్తున్న సెల్ఫీ కూడా వైర‌ల్ అయ్యింది. తాతగారి ఆశీర్వాదంతో అసాధార‌ణ అభిమానుల అండ‌దండ‌లు త‌న‌కు ఉన్నాయి. యువ‌హీరో ఏ మేర‌కు మ్యాజిక్ చేయ‌బోతున్నాడో వేచి చూడాలి.