Begin typing your search above and press return to search.

నాన్నమ్మ చేతి సాంబార్‌ అంటే ఎంతో ఇష్టమట

By:  Tupaki Desk   |   18 Aug 2020 4:40 PM IST
నాన్నమ్మ చేతి సాంబార్‌ అంటే ఎంతో ఇష్టమట
X
యంగ్‌ హీరో రానా ఇటీవలే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెల్సిందే. రానా పెళ్లి గురించి ఎంతో కాలంగా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే చివరకు రానా పెళ్లి చాలా స్పీడ్‌ గా అయిపోయింది. మిహికా అంటే ఇష్టపడటం ఆమెను ప్రేమించడం ప్రేమ విషయం చెప్పడం ఆ వెంటనే నెలల గ్యాప్‌ లోనే పెళ్లి చేసుకోవడం. రానా పెళ్లి విషయం ఇంకా కొందరికి నమ్మశక్యంగా లేదు. రానా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తూ తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఆ ఇంటర్వ్యూలో రానా పలు విషయాలను తెలియజేశాడు. సాదారణంగా ఫుడ్‌ అంటే ఎంతో ఇష్టపడే రానా ఈమద్య కాలంలో డైటింగ్‌ అంటే చాలా వరకు ఫుడ్‌ తగ్గించాడట. గతంలో ఫుడ్‌ విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా తినేవాడట. కాని ఇప్పుడు అలా కాదట. ఇక చిన్నప్పటి నుండి కూడా నాన్నమ్మ చేసే సాంబార్‌ అంటే రానాకు చాలా ఇష్టమట. నాన్నమ్మ సాంబార్‌ చేస్తే ఎంతో ఇష్టంగా తినేవాడిని అంటూ చెప్పిన రానా ప్రస్తుతం ఏం ఇష్టం అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

మిహికా చేతి వంటను ఇకపై రానా ఇష్టపడతాడేమో అంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. రానా నటించిన రెండు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. వాటిలో మొదటగా అరణ్య చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక విరాట పర్వం చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్‌ లు కూడా చర్చల దశలో ఉన్నాయి.