Begin typing your search above and press return to search.

విరుష్క కూతురికి గ్రాండ్ గా వెల్ కం చెప్పారుగా..!

By:  Tupaki Desk   |   19 March 2021 4:30 PM GMT
విరుష్క కూతురికి గ్రాండ్ గా వెల్ కం చెప్పారుగా..!
X
ఈ ఏడాది జనవరిలో అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ జంట పండంటి ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ జంట‌ పేరెంట్ హుడ్ ‌ను ఆస్వాధిస్తోంది. కుమార్తె వామికను క్ష‌ణ‌మైనా వీడ‌లేదు ఈ జంట‌. అనుక్ష‌ణం గారాల ప‌ట్టీతోనే..!

ఇటీవ‌లే వామిక లుక్ ని విరుష్క జంట అభిమానుల‌కు ప్ర‌ద‌ర్శించారు. తాజాగా ఓ హోట‌ల్ వాళ్లు.. వామిక‌కు ఘ‌న‌మైన వెల్ కం చెబుతూ ఏకంగా స్వీట్ హోమ్ అంటూ.. విరుష్క‌కు కేటాయించిన గ‌ది ఎంట్రాన్స్ నేమ్ ప్లేట్ లో వామిక పేరును వేయ‌డం ద్వారా ప్రేమ‌ను కురిపించారు.

అహ్మదాబాద్ లో విరాట్ కి కేటాయించిన హోటల్ గది వ‌ద్ద స‌న్నివేశ‌మిది. ఇలా నేమ్ ప్లేట్ పైభాగంలో `హోమ్ స్వీట్ హోమ్` అని రాసిన హోట‌ల్ వాళ్లు వామికా కోసం వ్యక్తిగతీకరించిన నేమ్ ‌ప్లేట్ ని డిజైన్ చేయించారు. ఇది వామిక‌కు గ్రాండ్ వెల్కం అనే చెప్పాలి. ఇంత‌కుముందే వామిక‌కు రెండు నెల‌లు పూర్త‌యిన‌ సంద‌ర్భంగా కేక్ క‌టింగ్ కార్య‌క్ర‌మంతో విరుష్క జోడీ కొలీగ్స్ కి భారీ విందును ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.