Begin typing your search above and press return to search.

హీరో పాత్రను పరిచయం చేయడానికే గ్రాండ్ గా ఈవెంట్..!

By:  Tupaki Desk   |   6 April 2021 2:30 PM GMT
హీరో పాత్రను పరిచయం చేయడానికే గ్రాండ్ గా ఈవెంట్..!
X
అల్లు అర్జున్ - రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ''పుష్ప''. తెలుగు తమిళం కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఆగస్టు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ ఇంకా చాలా మిగిలే ఉంది. రాబోయే ఈ నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేసే విధంగా చిత్ర యూనిట్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. అలానే నాలుగు నెలల ముందే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారు. ఇప్పటికే పుష్ప ప్రీ ల్యూడ్ ని రిలీజ్ చేయగా.. ఏప్రిల్ 9న అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా ముందు రోజు ఏప్రిల్ 7న గ్రాండ్ గా టీజర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పుష్పరాజ్ ను పరిచయం చేయడానికి ఫస్ట్ మీట్ పేరుతో మేకర్స్.. టీజర్ లాంచ్ కోసం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దీని కోసం హైదరాబాద్ లోని జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌ ను బుక్ చేసుకున్నారు. ఈ వేదికపై టీజర్ ను రిలీజ్ చేయడంతో పాటుగా బన్నీతో కేక్ కట్ చేయించి బర్త్ డే సెలబ్రేషన్స్ చేయనున్నారు. అయితే టీజర్ లాంచ్ కోసమే పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేయడమేంటని అందరూ ఆలోచిస్తున్నారు. ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో 'పుష్ప'కు భారీ ప్రమోషన్స్ చేయాల్సిందిగా మేకర్స్ కు అల్లు అర్జున్ చెప్పడంతో పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేయడానికి రెడీ అయ్యారని టాక్ నడుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న బన్నీ.. 'పుష్ప' ఈవెంట్ నాటికి హైదరాబాద్ చేరుకోనున్నారు.