Begin typing your search above and press return to search.
మెగా అభిమానులను నిరుత్సాహపరిచిన మెగాస్టార్...!
By: Tupaki Desk | 28 April 2020 11:00 AM ISTమెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి కొద్దిగా లేట్ గా ఎంట్రీ ఇచ్చినా.. డైలీ ఏదొక ట్వీట్ చేస్తూ అభిమానులను సంతోషపెడుతున్నారు. రావడం లేట్ అయినా సోషల్ మీడియాలో కూడా ప్రత్యేకతను చూపిస్తూ వస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితులపై స్పందించడమే కాకుండా.. తన జ్ఞాపకాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ట్విటర్ వేదికగా సీసీసీ కోసం విరాళాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలపడం.. లాక్ డౌన్ సమయంలో ప్రజల్ల చైతన్యం కల్పించడం కోసం సందేశాలు... లాక్ డౌన్ వేళ ఇంటికే పరిమితమైన మెగాస్టార్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ.. ఇంటిపనుల్లో సాయం చేస్తూ బీ ద రియల్ మ్యాన్ అనిపించుకుంటూ చిరు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సాధారణంగా తన సినిమాలకి సంబంధించిన పాటలను వాటి చిత్రీకరణ సమయంలో పూర్తిగా వింటూ ఆనందిస్తానని.. మధ్యలో పాజ్ చేయడానికి ఇష్టపడనని చిరు ట్వీట్ చేశారు. అయితే ఇటీవల ఒక పాటను మాత్రం తరచూ పాజ్ చేస్తూ.. మళ్లీ మొదటి నుంచి వింటూ ఎంజాయ్ చేస్తున్నానని చిరు ట్వీట్ చేశారు. అందుకు కారణం ఏమిటనేది రేపు ఉదయం 9 గంటలకు చెబుతానంటూ అభిమానులను సస్సెన్స్ లో పెట్టారు చిరు. చిరంజీవి ఏ పాట గురించి చెప్పబోతున్నారో..అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. అంతేకాకుండా ఆ సాంగ్ చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న 'ఆచార్య' సినిమాలోనిదని అందరూ అనుకున్నారు.
అయితే నేడు ఆ సాంగ్ వివరాలు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు చిరు. ఖైదీ నంబర్ 150 చిత్రంలోని ‘మిమ్మీ మిమ్మీమి.. ఇకపై ఓన్లీ యూ అండ్ మీ’ పాట తను చాలా సార్లు విన్నానని తెలిపారు. ఈ పాటను పిల్లలు కూడా చాలా ఇష్టపడతున్నారని చెప్పిన చిరు.. ఆ పాటను తన మనవరాలు నవిష్క ఎంతగా ఇష్టపడుతుందో తెలిపే వీడియోను షేర్ చేశారు. ఆ పాట చూస్తున్నప్పుడు నవిష్కతో కలిసి చిరు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అయితే పాటను మధ్యలో పాస్ చేయడంతో నవిష్క ఎడ్చేసింది. దీంతో చిరు ఏం కావాలని అడిగారు.. దానికి నవిష్క 'మిమ్మీ' అని చెప్పింది. దీని గురించి చిరు ట్వీట్ చేస్తూ ‘నేను మ్యూజిక్‌కు ఉన్న శక్తి గురించి ఎప్పుడూ ఆశ్చర్యపోతాను. ఈ పాటకు కేవలం ఏడాది చిన్నారి ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి. డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించడమే కాకుండా ఎంతో ఆనందాన్ని పొందుతుంది. పాటను మధ్యలో ఆపి, మళ్లీ ప్లే చేస్తూ.. తనకు ఆ పాట నిజంగా ఇష్టపడుతుందా అని చూశాను. ఈ పాట నాది కాబట్టి, అమ్మమ్మ సురేఖ దగ్గర క్రెడిట్ నాకే’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ 'ఆచార్య' అప్డేట్ కాదని నిరుత్సాహానికి గురైనప్పటికీ మెగాస్టార్ నుండి ఇలాంటి ట్వీట్ రావడంతో సంతోషంగా ఉన్నారు. ఏదేమైనా మూవీ అప్డేట్ వస్తుందని భావించిన మెగా అభిమానులకు నిరాశే ఎదురైందని చెప్పవచ్చు.