Begin typing your search above and press return to search.

ఎగబడిన ఫ్యాన్స్.. చేయి చేసుకున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   28 Sept 2022 9:20 AM IST
ఎగబడిన ఫ్యాన్స్.. చేయి చేసుకున్న హీరోయిన్
X
ఇటీవల కాలంలో సినిమా ప్రమోషన్స్ కోసం చాలామంది సినీ తారలు డైరెక్ట్ గా జనాల్లోకి వెళుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జనాలు తిరిగే మాల్స్ లోనే ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో కొంతమంది పొరపాటు కారణంగా హీరోయిన్స్ చేదు అనుభవాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. రీసెంట్ గా కేరళలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఒక హీరోయిన్ అయితే సహనం కోల్పోయే విధంగా ఫ్యాన్స్ ఏకంగా ఎగబడ్డారు. ఇక పరిస్థితి వారిపై చేయి చేసుకునే వరకు వెళ్ళింది. సినీ తారలను చూస్తే చాలామంది ఫ్యాన్స్ తెలియకుండానే వారి సహనాన్ని కోల్పోయి ఎగబడతారు.

అవతలి వారు ఎంతగా ఇబ్బంది పడతారు అనే విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోరు. ఇక ఈ క్రమంలో రీసెంట్ గా కేరళలో ప్రముఖ హీరోయిన్ సానియా అయ్యప్పన్ తన రాబోయే సినిమా 'సాటర్డే నైట్' సినిమా ప్రమోషన్స్ కోసం కేరళ కాళికట్ లోని హై లైట్ మాల్ కు వెళ్ళింది. ఈ నటి ఇంతకుముందు మోహన్ లాల్ లూసిఫార్ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది.

ఇక ఆమే వెళ్లిన ఈవెంట్ అయితే బాగానే జరిగింది. జనాలు కూడా భారీ సంఖ్యలో వచ్చారు. కానీ ఆమె బయటకు వెళ్ళిపోయే క్రమంలో మాత్రం ఒక్కసారిగా జనాలు ఎగబడ్డారు.

అసలు నిర్వాహకులు ఆ ఈవెంట్ ఎలా ప్లాన్ చేశారో ఆ వీడియో చేస్తేనే అర్థమవుతోంది. చుట్టూ బాడీగార్డ్స్ ఉన్నప్పటికీ కూడా అప్పటికే పరిస్థితి మొత్తం చేయి దాటిపోయింది. కుర్రాళ్ళు చాలా వరకు కొంత సేపటి తర్వాత హద్దులు దాటేసి హీరోయిన్ మీదకు వచ్చారు. కొందరు తప్పుగా టచ్ చేయటంతో సానియా కూడా సహనం కోల్పోయి చేయి చేసుకునే వరకు వెళ్ళింది.

అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది. ఇదివరకే ఆ ప్రదేశంలో ప్రమోషన్ చేసిన చాలామంది సినీ తారలకు ఈ తరహా చేదు అనుభవాలు ఎదురైనట్లుగా తెలుస్తోంది. నిర్వాహకులు ఈ తరహా ప్రమోషన్స్ ఎలా ఏర్పాటు చేస్తారో అర్థం కావడం లేదు అని నెటిజన్లు కూడా భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.