Begin typing your search above and press return to search.

మహేష్‌ తో సినిమా ఏమైందంటే.. గౌతమ్‌ మీనన్ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   18 Sep 2022 4:30 PM GMT
మహేష్‌ తో సినిమా ఏమైందంటే.. గౌతమ్‌ మీనన్ కామెంట్స్‌!
X
తమిళ దర్శకుడు అయినా కూడా గౌతమ్ వాసుదేవ్ మీనన్ కి తెలుగు లో మంచి పాపులారిటీ ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు తెలుగులో మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. కనుక ఆయన దర్శకత్వంలో సినిమా అనగానే ఒకింత ఆసక్తి తెలుగు ప్రేక్షకుల్లో ఉంటుంది. అందుకే ఆయన తమిళంలో శింబు హీరోగా తెరకెక్కించిన సినిమాను లైఫ్ ఆఫ్‌ ముత్తు అనే టైటిల్‌ తో డబ్ చేశారు.

తాజాగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన మేకర్స్ ఇక్కడ ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్‌ సభ్యులను హైదరాబాద్‌ కు తీసుకు వచ్చారు. దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. టాలీవుడ్‌ పై తనకు ఉన్న అభిమానం ను చాటుకున్నాడు.

ఒక ఇంటర్వ్యూలో గౌతమ్‌ మీనన్ ను మీరు గతంలో మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కథా చర్చలు జరిగినట్లుగా కూడా ప్రచారం జరిగింది. ఆ సినిమా మధ్య లోనే ఎందుకు ఆగి పోయింది అంటూ ప్రశ్నించగా.. ఆయన సమాధానం చెప్తూ... తాను మహేష్ బాబుతో ఏ మాయ చేశావే సినిమాను చేయాలి అనుకున్నాను.

కథను మహేష్ బాబు గారికి చెప్పాను. కానీ ఆయన ఆ కథను తిరష్కరించడంతో తాను నాగ చైతన్యతో సినిమాను చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు కు మరో కథ వినిపించకుండా అదే కథను మరో హీరో తో చేసి గౌతమ్ వాసుదేవ్ మీనన్ సక్సెస్ దక్కించుకోవడం చూస్తే ఆ కథకు ఆయనపై ఉన్న నమ్మకం ను అర్థం చేసుకోవచ్చు.

ఇక గౌతమ్‌ మీనన్ తమిళంతో పాటు తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. అందుకు సంబంధించి కథల చర్చలు జరుగుతున్నాయట. సెన్సిబుల్‌ దర్శకుడిగా పేరు దక్కించుకున్న గౌతమ్‌ మీనన్ తో సినిమా అంటే టాలీవుడ్‌ లోని పలువురు స్టార్‌ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తారు. అయితే ఆయన మాత్రం చాలా ఆచి తూచి సినిమాలు చేస్తూ ఉన్నాడు. తెలుగు లో గౌతమ్ మీనన్ చేయబోతున్న సినిమా ఎప్పుడు ఉంటుంది.. ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.