Begin typing your search above and press return to search.

చరణ్ ను నెక్స్ట్ డైరెక్ట్ చేయబోయేది అతడే..!

By:  Tupaki Desk   |   31 Dec 2020 2:30 PM GMT
చరణ్ ను నెక్స్ట్ డైరెక్ట్ చేయబోయేది అతడే..!
X
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీతోపాటు తండ్రి చిరంజీవి నటిస్తున్న ఆచార్యలోనూ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చెర్రీ రోల్ కీలకంగానే ఉంటుందట. త్వరలో ఈ సినిమా సెట్స్ లోకి చరణ్ వెళ్లాల్సి ఉంది.

కానీ.. ఊహించని విధంగా చెర్రీ కొవిడ్ బారిన పడ్డాడు. తనకు కరోనా సోకిందని ప్రకటించడంతో అభిమానులతోపాటు చిత్ర యూనిట్ కూడా ఆందోళనకు గురైంది. త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కాగా.. ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ ఏ డైరెక్టర్ సినిమా చేస్తారు అన్నది తేలలేదు. నిజానికి ఈ ప్రశ్న ఇప్పటిది కాదు.. ఆర్ఆర్ఆర్ మొదలైనప్పటి నుంచీ కొనసాగుతున్నదే. కానీ.. ఇప్పటి వరకూ క్లారిటీ లేదు.

చరణ్ నెక్స్ట్ సినిమా పలానా డైరెక్టర్ తో చేస్తాడంటూ చాలా మంది దర్శకుల పేర్లే వినిపించాయి. అయితే.. ఎవరూ ఫైనల్ కాలేదు. లేటెస్ట్ గా మరో దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. ఓ టాలెంటెడ్ దర్శకునికే తన డేట్స్ ఇస్తాడని ప్రచారం సాగుతోంది. అతడే.. “మళ్ళీ రావా”, “జెర్సీ” లాంటి ఫీల్ గుడ్ ఎమోషనల్ సినిమాలను అందించిన గౌతమ్ తిన్ననూరి.

చరణ్ ను నెక్స్ట్ డైెరెక్ట్ చేయబోయేది ఈ యంగ్ డైరెక్టరే అని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. మరి, ఇప్పటి వరకూ చరణ్ ఏమైనా కలిశాడా? కథ వినిపించాడా? చరణ్ ఏమన్నాడు..? వంటి వివరాలు ఏవీ తెలియలేదు. మరి, గౌతమ్ నిజంగానే చెర్రీ సినిమాకు దర్శకత్వం వహిస్తాడా? లేదంటే.. గతంలో వినిపించిన పేర్ల జాబితాలో ఈ పేరు కూడా చేరుతుందా? అన్నది చూడాలి.