Begin typing your search above and press return to search.

బన్నీ పాప మళ్లొచ్చింది.. ఎన్నాళ్ళకో..

By:  Tupaki Desk   |   20 July 2015 5:41 PM IST
బన్నీ పాప మళ్లొచ్చింది.. ఎన్నాళ్ళకో..
X
బన్ని బన్ని బన్ని బన్ని.. సిన్ని సిన్ని సిన్ని సిన్ని.. అంటూ అదిరిపోయే స్టెప్పు లేస్తూ సెగల్‌ రేపింది గౌరీ ముంజల్‌. అల్లు అర్జున్‌, వినాయక్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కి బంపర్‌ హిట్‌ కొట్టిన బన్నిలో ఈ అమ్మడు కథానాయికగా నటించి తెలుగు యువత మనసు దోచింది. ఆ సినిమాతోనే అల్లూ వారబ్బాయ్‌ బన్ని పేరు కి అంకితమైపోయాడు. నాటి నుంచి ఇంటా బైటా అందరూ బన్ని అనే పిలుచుకుంటున్నారు.

బన్ని లైఫ్‌ లో అంతటి ఇంపార్టెన్స్‌ ఉన్న సినిమాలో నాయికగా నటించిన గౌరీ ఆ తర్వాత టాలీవుడ్‌ లో వెలిగిపోతుందనే అనుకున్నారు. కానీ ఫేట్‌ అలా రాసిపెట్టి లేదు. ఆ సినిమా తర్వాత ఈ అమ్మడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దాంతో బ్యాక్‌ టు పెవిలియన్‌ అన్నట్టు టాలీవుడ్‌ కెరీర్‌ నుంచి నిష్క్రమించింది. చాలా కాలం తర్వాత ఓ వేడుక లో ఇదిగో ఇలా దర్శనమిచ్చింది. తెల్ల రంగు డ్రస్సులో రాణీ హంసలా మెరిసిపోతున్న ఈ అమ్మడు బాగా బొద్దెక్కి పోయింది. కోలమొహం కాస్తా గుండ్రంగా సూర్య బింబంలా అయిపోయింది.

మెడ వొంపులు, నడుము మడతల్లో కొలెస్ట్రాల్‌ కంటెంట్‌ విపరీతంగా పెరిగిపోయి రూపురేఖలే మారిపోవడంతో పెద్దగా ఎవ్వరూ గుర్తుపట్టలేదు. అంతేనా ఈ తెల్లరంగు దుస్తుల్లో కాస్త కిక్‌ లెస్‌ గా కనిపిస్తోంది. తెల్ల గౌనుకి కాంబినేషన్‌ గా డిజైనర్‌ పర్సు చేతిలో పట్టుకుని తళతళలాడించింది ముంజాల్‌. ఇప్పుడు ఒకవేళ టాలీవుడ్‌ లో అవకాశం ఇవ్వదలిస్తే మమ్మీ, అక్క, చెల్లి, వదిన పాత్రలకైతేనే సూటబుల్‌.