Begin typing your search above and press return to search.

విమర్శలకు కంగనా కౌంటర్​.. సెక్యూరిటీ ఎందుకిచ్చారో వివరణ

By:  Tupaki Desk   |   15 Sept 2020 3:40 PM IST
విమర్శలకు కంగనా కౌంటర్​.. సెక్యూరిటీ ఎందుకిచ్చారో వివరణ
X
తనపై వచ్చిన విమర్శలకు కంగనా రనౌత్​ ఘాటు రిప్లై ఇచ్చింది. వైప్లస్​ సెక్యూరిటీ ఎప్పుడు ఏ సందర్భంలో ప్రభుత్వం సమకూరుస్తోంది స్పష్టం చేసింది. ఇంతకీ కంగనాపై వచ్చిన విమర్శలు ఏమిటంటే.. సుశాంత్​సింగ్​ రాజ్పుత్ ఆత్మహత్య వ్యవహారం బాలీవుడ్​ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో జోక్యం చేసుకున్న కంగనా రనౌత్​ పలు హాట్​ కామెంట్లు చేశారు. ఓ దశలో ముంబై పాక్​ ఆక్రమిత కశ్మీర్​ను తలపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆమెపై శివసేన మండిపడింది. కంగనాను ముంబైకి అడుగుపెట్టనివ్వబోమంటూ హెచ్చరించింది. కంగనా కూడా నేను ఫలానా తేదీన వస్తున్నాను.. ఏం చేస్తారో చేసుకోండి.. అంటూ సవాల్​ విసిరింది. ఈ తీవ్ర ఉద్రిక్తల నడుమ కంగనాకు కేంద్రహోంశాఖ వై ప్లస్ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. అయితే ఆమెకు సెక్యూరిటీ కల్పించడం పట్ల పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ప్రజల పన్నులు దుబారా చేస్తారా?
కంగనా రనౌత్​కు వైప్లస్​ సెక్యూరిటీ కల్పించడం పట్ల సుప్రీంకోర్టు న్యాయవాది బ్రిజేశ్​ కలప్ప అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘కంగనాకు వై ప్లస్​ సెక్యూరిటీ కల్పించడం వల్ల ప్రభుత్వానికి నెలకు రూ.10 లక్షల భారం పడుతుంది. అదంతా ప్రజల సొమ్ము. ప్రజలు పన్నులు కడుతూ ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తుంటే ఇలా ప్రజాధనాన్ని వృథా చేస్తారా? వలస కూలీలను స్వస్థలాలకు చేర్చడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. నిరుపేదలకు నిత్యావసరసరుకులు పంపిణీ చేసేందుకు నిధులు దొరకవు. కరోనా రోగులకు సరైన వైద్యం అందించేందుకు వెనకాడతారు. కానీ ఓ సినిమా హీరోయిన్​ కోసం ఇంత డబ్బు తగలేస్తారా.. ఇప్పడు కంగనా ముంబై వదిలిపెట్టి హిమాచల్​ ప్రదేశ్​ వెళ్లింది. ఇప్పుడామెకు సెక్యూరిటీ అవసరం లేదు కదా.. వెనక్కి పంపించేస్తారా’ అంటూ కలప్ప ఫైర్​ అయ్యారు.

కలప్ప వ్యాఖ్యలకు కంగన కౌంటర్​
న్యాయవాది కలప్ప.. తనపై చేసిన ఆరోపణలకు కంగనా తనదైన శైలిలో స్పందించారు. ‘కేంద్రప్రభుత్వం మీరు చెప్పినట్టు నడుచుకోదు. నాకు భద్రత కల్పించింది కేంద్ర హోంశాఖ. భద్రత కల్పించేందుకు ప్రభుత్వం వద్ద కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. ఇంటలిజెన్స్​వాళ్లు ఇచ్చే నివేదిక ఆధారంగానే భద్రతను కల్పిస్తారు. ఒకవేళ నాకు భద్రత అవసరం లేదని భావిస్తే కేంద్రమే వెనక్కి తీసుకుంటుంది. మీరు అనవసరంగా అత్యుత్సాహం ప్రదర్శించకండి’ అంటూ కంగనా కౌంటర్​ ఇచ్చారు. కాగా కంగన వ్యాఖ్యలకు సోషల్​మీడియాలో మద్దతు వెల్లువెత్తుతుంది.