Begin typing your search above and press return to search.

చైతూని మాస్ హీరో చేస్తాడా?!

By:  Tupaki Desk   |   5 Aug 2015 5:05 AM GMT
చైతూని మాస్ హీరో చేస్తాడా?!
X
గౌత‌మ్‌ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య అన‌గానే అంద‌రికీ `ఏమాయ చేసావె`నే గుర్తుకొచ్చింది. `మ‌ళ్లీ అలాంటి సినిమా తీస్తున్నారేమో` అనుకొన్నారంతా. పైగా ఇక్క‌డ నాగ‌చైత‌న్య‌, అక్క‌డ శింబు న‌టిస్తుండ‌టంతో `క‌న్ఫ‌ర్మ్‌ గా, ఇది `ఏమాయ చేసావె`లాంటి మ‌రో ప్రేమ‌క‌థే` అని మాట్లాడుకొన్నారు. కానీ గౌత‌మ్‌ మీన‌న్ మాత్రం వేరే త‌ర‌హా సినిమా తీస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. `ఏమాయ చేసావె`తో నాగ‌చైత‌న్య‌ ని ప్రేమ‌క‌థల‌కు త‌గ్గ క‌థానాయ‌కుడిగా మ‌లిచిన గౌత‌మ్‌ మీన‌న్ ఈసారి మాత్రం ఆయ‌న్ని ఓ మాస్ హీరో గా చూపించే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

గౌత‌మ్ మీన‌న్‌ కి క్లాసూ తెలుసు, మాసూ తెలుసు. `ఏమాయ చేసావె`లాంటి సినిమా చేసిన ఆయ‌న `ఘర్ష‌ణ‌`, `ఎంత‌వాడుగానీ` త‌ర‌హా మాస్ చిత్రాలు కూడా చేశాడు. అందుకే నాగ‌చైత‌న్య‌ తో ఈసారి వెరైటీ గా ఓ మాస్ క‌థ‌ని తీస్తున్న‌ట్టు స‌మాచారం. సినిమాకి `వెంటాడు` అనే టైటిల్‌ ని ఫిక్స్ చేస్తున్న‌ట్టు తెలిసింది. ప్రేమ‌క‌థే అయితే `వెంటాడు` త‌ర‌హా టైటిల్‌ ని పెట్ట‌రు. అంత‌ర్లీనంగా ప్రేమ‌క‌థ ఉన్న‌ప్ప‌టికీ చైతూ ని మాత్రం మాసీగా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. సినిమాకోసం నాగ‌చైత‌న్య ఓ కొత్త గెట‌ప్‌ లో క‌నిపిస్తున్నాడు. లైట్‌ గా గెడ్డం పెంచి క్లాసూ, మాసూ రెండు లుక్కులూ క‌నిపించేలా త‌యారయ్యాడు. ఇటీవ‌ల ర‌చ‌యిత క‌మ్ నిర్మాతల్లో ఒక‌రైన కోన వెంక‌ట్ ఈ సినిమాకి సంబంధించిన స్టిల్‌ ని బ‌య‌టికి వ‌దిలాడు.