Begin typing your search above and press return to search.

జూనియ‌ర్... శ్రీమంతుడు!

By:  Tupaki Desk   |   13 Aug 2015 4:04 AM GMT
జూనియ‌ర్... శ్రీమంతుడు!
X
మ‌హేష్ పుణ్య‌మా అని సైకిల్‌ స్టోర్ల‌కు గిరాకీ పెరిగింది. ఒక‌ప్పుడు ఎంత పెద్ద ధ‌న‌వంతులైనా, ఎన్ని ల‌గ్జ‌రీ కార్లు ఉన్నా... ఇంటి ముందు ఓ బైక్ కూడా నిలుపుకొనేవాళ్లు. ల‌క్ష‌లు వెచ్చించి ఓ స్టైలిష్ బైక్ కొని పెట్టుకొనేవాళ్లు. ఇప్పుడు బైక్‌ కంటే సైకిల్‌ పై మోజు పెంచుకొంటున్నారు. అదంతా `శ్రీమంతుడు` ఎఫెక్టే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సైకిల్‌ ని వేసుకొని వెండితెర‌పైకి వ‌చ్చిన‌వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే మహేష్ మాత్రం వారంద‌రికంటే ప్ర‌త్యేకంగా క‌నిపించాడు. అది కూడా శ్రీమంతుడు టైటిల్ పెట్టుకొని మ‌రీ సైకిల్‌ పై రావ‌డం స‌మ్‌ థింగ్ స్పెష‌ల్ అనిపించింది ప్రేక్ష‌కుల‌కు. ఇప్పుడంతా `శ్రీమంతుడు`లో ఉన్నటువంటి స్టైలిష్ సైకిల్ కొనేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. మ‌హేష్‌ బాబు కొడుకు గౌత‌మ్ కృష్ణ అండ్ ఫ్రెండ్స్ అయితే ఇప్ప‌టికే ఆ సైకిళ్ల‌ని కొనేసి వీధుల్లో షికార్లు చేస్తున్నారు.

ఎప్పుడూ త‌న తండ్రినే ఫాలో అవుతుంటాడు గౌత‌మ్. మ‌హేష్‌ కి వ‌చ్చిన అవార్డుల్ని చూసి గౌత‌మ్ తానూ ఇలాంటి అవార్డులు కొట్టి నాన్న‌లాగే స‌ప‌రేట్‌ గా ఓ రూమ్‌ లో పెట్టుకోవాల‌నుకొన్నాడ‌ట‌. ఇటీవ‌ల మాటీవీ అవార్డు తీసుకొని దాన్ని ఇంట్లో సెప‌రేట్‌ గా పెట్టుకొన్నాడ‌ట‌. అలా మ‌హేష్ స్టైల్స్‌ ని కూడా ఫాలో అవుతుంటాడు. అన్న‌ట్టు ఆమ‌ధ్య డ‌బ్ స్మాష్‌ లో మ‌హేష్ చెప్పిన పండుగాడు డైలాగ్‌ ని కూడా గౌత‌మ్ చెప్ప‌డం చూశాం. ఇప్పుడేమో జూనియ‌ర్ శ్రీమంతుడు అవ‌తార‌మెత్తాడు. అందుకు సంబంధించిన ఫొటోనే ఇది. `టీమ్ శ్రీమంతుడు` అంటూ గౌత‌మ్ మావ‌య్య సుధీర్‌ బాబు ఈ పిక్‌ ని ట్వీట్ చేశాడు.