Begin typing your search above and press return to search.

దేవసేనకు ఇన్ని ఆఫర్లా ?

By:  Tupaki Desk   |   11 May 2019 6:02 AM GMT
దేవసేనకు ఇన్ని ఆఫర్లా ?
X
భాగమతి సక్సెస్ తర్వాత తెరమీదే కాదు బయట కనిపించడం కూడా అరుధైపోయిన మిల్కీ బ్యూటీ అనుష్క కొత్త సినిమాల విషయంలో ఎంతకీ క్లారిటీ రావడం లేదు. కోన వెంకట్ నిర్మాణంలో ఓ డెబ్యు డైరెక్టర్ దర్శకత్వంలో రూపొందే మూవీతో పాటు సైలెన్స్ అనే ఇండో అమెరికన్ ఫిలిం మాత్రమే అనుష్క ఒప్పుకున్నట్టు ఇప్పటిదాకా ఉన్న అప్ డేట్.

తాజాగా మరో రెండు చారిత్రాత్మక ప్రాజెక్ట్స్ లో అనుష్క భాగం కాబోతోందనే వార్త ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. దాని ప్రకారం సైరా నరసింహరెడ్డిలో ఒక థీమ్ సాంగ్ కోసం అనుష్క ఓకే చెప్పినట్టుగా తెలిసింది. అయితే టీమ్ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. స్వీటీ గతంలో చిరుతో స్టాలిన్ లో ఓ స్పెషల్ సాంగ్ కోసం కాలు కదిపింది. దాని తర్వాత ఈ కాంబో సాధ్యపడలేదు

సైరా తర్వాత ఆర్ ఆర్ ఆర్ లో చాలా కీలకంగా అనిపించే ఓ క్యామియో కూడా స్వీటీ చేయబోతున్నట్టు మరో న్యూస్. బాహుబలి రెండు భాగాలూ విక్రమార్కుడు ఇలా అనుష్కతో రాజమౌళి కాంబినేషన్ మంచి బాండింగ్ సెట్ చేసింది. సో జక్కన్న అడిగితే అనుష్క కాదనే ప్రసక్తి ఉండకపోవచ్చు. ఇదీ అఫీషియల్ గా తెలియాల్సి ఉంది. ఏదో ఒకటైనా చేసే అవకాశాలు కొట్టిపారేయలేం. ఒకవేళ ఇదే కనక నిజమైతే రెండు సినిమాలకు మరో ఆకర్షణ తోడవుతుంది. ఏ మీడియాకు అందుబాటులో లేని అనుష్క దీని గురించి ఓ క్లారిటీ ఇస్తే బెటర్