Begin typing your search above and press return to search.

బిగువ‌ల‌తో త‌గువులు పెడుతున్న క‌పూర్ గాళ్

By:  Tupaki Desk   |   2 Aug 2022 4:31 AM GMT
బిగువ‌ల‌తో త‌గువులు పెడుతున్న క‌పూర్ గాళ్
X
బాలీవుడ్ లో నేటిత‌రం న‌ట‌వార‌సుల్లో జాన్వీ క‌పూర్ స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిల‌వ‌డం ఎలానో జాన్వీని చూసి ఇత‌రులు నేర్చుకోవాలి. సారా అలీఖాన్- అన‌న్య పాండే- సానయా క‌పూర్ లాంటి భామ‌లు ఇప్ప‌టికే జాన్వీని ఫాలో అవుతున్నారంటే అమ్మ‌డి ప్ర‌భావం ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. న‌ట‌వార‌సులంద‌రికీ మార్గ‌ద‌ర్శ‌నం చేసేది క‌ర‌ణ్ జోహార్.. మ‌నీష్ మ‌ల్హోత్రా లాంటి ఫ్యాష‌న్ గురూస్ అన్నది విధిత‌మే.

బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్ ..స్విమ్ సూట్ యాక్ట్ .. ర్యాంప్ పై క్యాట్ వాక్.. ఇలా వెరైటీ ఈవెంట్ల‌తో కుర్ర‌కారు గుండెల్ని కొల్ల‌గొట్ట‌డంలో ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను పొందిన జాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ ఫాలోయింగ్ ని పెంచుకుంది. ప్ర‌తిసారీ ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ ప‌రంగా ఏదో ఒక కొత్త‌ద‌నాన్ని ప‌రిచ‌యం చేసేందుకు త‌పిస్తున్న జాన్వీ పై ఒక సెక్ష‌న్ గుర్రుమీద ఉంది. ఈ భామ పూన‌మ్ పాండేకి క్లాసిక్ వెర్ష‌న్ అంటూ కామెంట్లు చేసిన వారు లేక‌పోలేదు. అంత‌గా ఈ బ్యూటీ అందాల ఆర‌బోత అవిరామంగా కొన‌సాగుతోంది.

తాజాగా జాన్వీ క‌పూర్ గుడ్ ల‌క్ జెర్రీ ప్ర‌మోష‌న్స్ లో అందాలు ఆర‌బోసిన తీరు చ‌ర్చ‌కు వ‌చ్చింది. జిగ్ జాగ్ ఛ‌మ్కీల‌తో డిజైన‌ర్ ఫ్రాక్ లో జాన్వీ టూ హాట్ గా క‌నిపించింది. టైట్ ఫ్రాక్ లో ఇబ్బందిగా క‌నిపించిన‌ జాన్వీ అంద‌చందాల‌ను కెమెరాల్లో బంధించేందుకు ఫోటోగ్రాఫ‌ర్లు పోటీప‌డుతున్న తీరు ఈ వీడియోలో క‌నిపించింది. జాన్వీ ఈ వీడియోని ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అది ఇప్పుడు వైర‌ల్ గా మారింది. పైనున్న మామ్ గ‌ర్వించే ట్రీటిస్తున్న జాన్వీ.. శ్రీ‌దేవికి ఇచ్చిన ప్రామిస్ ని నెర‌వేర్చేందుకు చాలా త‌పిస్తోందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

త్వ‌ర‌లో టాలీవుడ్ ఎంట్రీ?జాన్వీ క‌పూర్ ఇటీవ‌ల‌ సౌత్ వైపు ఫోక‌స్ చేసింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అందుకు జాన్వీ తండ్రి బోనీ క‌పూర్ లైన్ క్లియ‌ర్ చేస్తున్నారు. అత‌డు ఇటీవ‌ల‌ సౌత్ లో పలు భారీ చిత్రాలు నిర్మిస్తూ హీరోలు నిర్మాత‌ల‌కు ట‌చ్ లో ఉన్నారు.

అతను దక్షిణాదిలో జాన్వీ కెరీర్ కి ఎలాంటి డోఖా లేకుండా అవ‌కాశాల వేట‌ను ప్రారంభించాడు. అలాగే దక్షిణాదిలో పెద్ద ప్రాజెక్ట్ ల కోసం వెతకమని ముంబైలోని తన మేనేజర్ ల‌కు జాన్వీ ఆర్డర్ వేసింద‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి. అందాల జాన్వీ తెలుగులో ఏ హీరోతో తెరంగేట్రం చేయ‌నుందో వేచి చూడాలి.

బాలీవుడ్ లో త‌ప్ప ఇత‌ర భాష‌ల్లో ఇంకా న‌టించ‌ను అని చెప్పిన జాన్వీ స‌డెన్ గా ఇలా టాలీవుడ్ కోలీవుడ్ లో అవ‌కాశాల వేట ప్రారంభించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఆరంభం జాన్వీకి దక్షిణాదిపై అంతగా ఆసక్తి లేదు.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇటీవ‌ల సౌత్ సినిమా రేంజు అమాంతం మారిపోయింది. అందుకే ఇప్పుడు ఇటువైపు చూస్తోంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. జూ.ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించాల్సిందిగా కొర‌టాల శివ ఇటీవ‌ల మ‌రోసారి జాన్వీతో ప్రపోజ‌ల్ పెట్టార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. దీనిపై మ‌రింత స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది.