Begin typing your search above and press return to search.

మినీ గౌనులో డోస్ పెంచిన శ్రీముఖి.. స్టన్నింగ్

By:  Tupaki Desk   |   21 Nov 2022 5:30 PM GMT
మినీ గౌనులో డోస్ పెంచిన శ్రీముఖి.. స్టన్నింగ్
X
యాంకర్ అనగానే ఎక్కువగా మాటలతో ఆకట్టుకుంటారు అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం మాటలతోనే కాకుండా గ్లామర్ తో కూడా ఎవరైతే ఎక్కువగా ఆకట్టుకుంటారో వారికి మంచి క్రేజ్ అయితే దక్కుతోంది. ఇక గ్లామర్ తో తెలుగులో ఎక్కువ స్థాయిలో క్రేజ్ పెంచుకుంటున్న వారిలో శ్రీముఖి కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. రష్మీ అనసూయ భరద్వాజ్ ఇలా మరికొందరు రెండు విధాలుగా ఎట్రాక్ చేస్తున్నప్పటికీ శ్రీముఖి మాత్రం తనదైన శైలిలో టెలివిజన్ ప్రపంచంలో ఒక మార్క్ అయితే ఏర్పరచుకుంది.

పటాస్ రియాల్టీ షో ద్వారా భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న శ్రీముఖి అంతకుముందు కొన్ని సినిమాలలో కూడా నటించింది. ఇక ప్రస్తుతం రెండు పడవల ప్రయాణం చేస్తున్న శ్రీముఖి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలతో మరింత క్రేజ్ పెంచుకుంటుంది. రోజురోజుకు ఆమె గ్లామర్ డోస్ మరింత పెంచేస్తోంది. ఆమె ఎలా కనిపించినా కూడా అందులో ఎంతో కొంత గ్లామర్ హైలైట్ అయ్యేవిధంగా ఆమె ఫోటో షూట్స్ లో పాల్గొంటుంది.

రీసెంట్ గా ఒక చిన్న గౌనులో శ్రీముఖి ఒకవైపు లెగ్స్ అందాలను మరొకవైపు టాప్ అందాలతో కుర్రాళ్ళను అతిపోయేలా చేసింది. శ్రీముఖి గతంలో చాలాసార్లు హీటెక్కించే అందాలతో మైమరిపించింది. కానీ ఈసారి మాత్రం స్టన్నింగ్ అయ్యేలా చేసింది అని కూడా నెటిజన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక శ్రీముఖి బిగ్ బాస్ తర్వాత చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

అనవసరమైన సినిమాలు కూడా పెద్దగా చేయడం లేదు. మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు దొరికితేనే సినిమాలు చేయాలని అనుకుంటుంది. అలాగే టెలివిజన్లో కూడా ఆమె గతంలో మాదిరిగా అయితే బిజీగా కనిపించడం లేదు.

కానీ అప్పుడప్పుడు సర్ప్రైజ్ అయితే ఇస్తుంది. ఇక ప్రస్తుతం ఆమె కొన్ని రియాల్టీ షోలకు అయితే హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి బోలా శంకర్ సినిమాలో కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతోంది. అలాగే శ్రీముఖి ఎప్పటినుంచో ఒక లేడీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ లో కూడా నటించాలని చర్చలు జరుపుతోంది. కానీ ఆ ప్రాజెక్టు మాత్రం సెట్స్ పైకి రావడం లేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.