Begin typing your search above and press return to search.

జులై సెంటిమెంట్..ప‌క్కాగా క‌లిసొచ్చేనా!

By:  Tupaki Desk   |   18 Jun 2022 12:30 AM GMT
జులై సెంటిమెంట్..ప‌క్కాగా క‌లిసొచ్చేనా!
X
మ్యాచో స్టార్ గోపీచంద్ కి జులై మాసం కొన్నాళ్ల‌గా సెంటిమెంట్ గా క‌లిసొస్తుంది. త‌న సినిమాల్ని జులైలో రిలీజ్ అయ్యేలా ప‌క్కా ప్లాన్ తో ముందుకు క‌దులుతున్నారు. వాస్త‌వానికి జులై రిలీజ్ అనేది యాదృశ్చికంగానే జ‌రిగింది. కానీ స‌క్సెస్ ల నేప‌థ్యంలో ఆమాసం ఓ సెంటిమెంట్ గా మారింది. విజ‌యాలు వ‌రించిన‌ప్పుడు సెంటిమెంట్ గా ఎందుకు భావించ‌కూడ‌దు? అన్న కోణంలో మ్యాచో స్టార్ జులైని అలా భావించ‌డం మొద‌లు పెట్టాడు.

నిజానికి ఈ సెంటిమెంట్ చాలా కాలంగానే కొన‌సాగిస్తున్నాడు. ఓ సారి పాస్ట్ లోకి వెళ్తే 'య‌జ్ఞం'..'సాహ‌సం'..'ల‌క్ష్యం'.. 'గౌత‌మ్ నందా' సినిమాలు జులైలో రిలీజ్ అయి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచాయి. అందుకే మ‌రోసారి అదే సెంటిమెంట్ ని రిపీట్ చేయాల‌ని ప‌క్కాగా ముందుకు క‌దులుతున్నాడు. 'గౌత‌మ్ నంద' త‌ర్వాత గోపీచంద్ కి స‌రైన స‌క్సెస్ ప‌డ‌లేదు.

ఆ విజ‌యంతో చాలా సినిమాలు చేసాడు కానీ చెప్పుకోద‌గ్గ హిట్ ప‌డ‌లేదు. 'ఆక్సిజ‌న్'.. 'పంతం'.. 'చాణ‌క్య‌'.. 'సిటీమార్'..'ఆర‌డుగుల బుల్లెట్' చిత్రాలు వేర్వేరు నెల‌ల్లో రిలీజ్ అయి నిరాశ‌జ‌న‌క‌మైన ఫ‌లితాలు అందిచాయి. దీంతో గోపీ చంద్ మ‌రోసారి జులై సెంటిమెంట్ ని ఎందుకు ఫాలో అవ్వ‌కూడ‌ద‌ని భావించి 'ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్' చిత్రాన్ని జులై లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. జులై 1న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు.

వాస్త‌వానికి చిత్రాన్ని జూన్ చివ‌ర్లో ముందుగా రిలీజ్ చేయాల‌ని భావించారుట‌. కానీ ఇంత‌వ‌ర‌కూ ఎలాగూ వెయిట్ చేసాం. జులై తొలి వారంలో రిలీజ్ పెట్టుకుందామ‌ని హీరో స‌ల‌హా ఇవ్వ‌డంతో మేక‌ర్స్ నిర్ణ‌యం మారిన‌ట్లు గుస గుస వినిపిస్తుంది. గోపీచంద్ కోరిక ప్ర‌కారం జులై 1 న రిలీజ్ అయితే బాగుంటుంద‌ని భావించి నిర్మాత‌లు ఆ తేదీని ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

మ‌రి ఇంత కాన్ఫిడెంట్ గా వ‌స్తున్నారంటే కంటెంట్ పై బ‌లంగానే ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఇక ద‌ర్శ‌కుడు మారుతి స‌క్సెస్ రేట్ కూడా బాగానే ఉంది. 'ఈరోజుల్లో' ద‌గ్గ‌ర‌నుంచి 'మంచి రోజులొచ్చాయ్' వ‌ర‌కూ బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్నాడు. డే బై డే షైన్ అవుతూ అగ్ర హీరోలతో సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు.

కెరీర్ ఆరంభంలో ప‌డిన కొన్ని ర‌కాల మ‌చ్చ‌ల్ని త‌న మార్క్ కంటెంట్ తో వేగంగానే చెరుపు కోగ‌లిగాడు. క్లీన్ ఎంట‌ర్ టైన‌ర్ లు తెర‌కెక్కిస్తూ త‌న‌కంటూ ఓ బ్రాండ్ ఉంద‌ని చెప్పే ప్ర‌య‌త్నం ప్ర‌శంసించ ద‌గ్గ‌దే. కానీ గోపీకి-మారుతికి ఎలా సింక్ అయింద‌న్న‌దే ఇక్క‌డ ఆస‌క్తిక‌రం. రెండు వ్య‌తిరేక ధృవాలు.

గోపీ చంద్ మాస్ ఇమేజ్ కి-మారుతి క్లాస్ ట‌చ్ అప్ కి ఏ మాత్రం సెట్ అవ్వ‌దు. కానీ ఈ కాంబినేష‌న్ ఇప్పుడు ఆ రెండింటిని ఇన్ బిల్డ్ చేసి ముందుకొస్తుంది. మ‌రి మారుతి మార్క్ చిత్రంగా ముద్ర వేస్తాడా? గోపీచంద్ మార్క్ హైలైట్ అవుతుందా? లేక‌ రెండింటిని బ్యాలెన్స్ చేసి కొత్త మారుతిని ఆవిష్క‌రిస్తాడా? అన్న‌ది రిలీజ్ త‌ర్వాత తెలుస్తుంది.