Begin typing your search above and press return to search.

గోపీచంద్‌.. తమన్నాల కూత మొదలవ్వబోతుంది

By:  Tupaki Desk   |   16 Nov 2020 9:10 AM GMT
గోపీచంద్‌.. తమన్నాల కూత మొదలవ్వబోతుంది
X
కరోనా కారణంగా నిలిచి పోయిన సినిమాలు అన్ని కూడా మెల్లగా మొదలవుతున్నాయి. గత రెండు నెలలుగా వరుసగా సినిమాలు పునః ప్రారంభం అవుతున్న నేపథ్యంలో గోపీచంద్‌ మరియు తమన్నాల 'సిటీమార్‌' మూవీ కూడా పట్టాలెక్కబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. దీపావళి సందర్బంగా ఈ సినిమా పోస్టర్‌ ను విడుదల చేసిన యూనిట్‌ సభ్యులు సినిమా షూటింగ్‌ ను ఈనెల 23 నుండి పునః ప్రారంభించబోతున్నట్లుగా పేర్కొన్నారు. కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్‌ ఇద్దరు కూడా కబడ్డీ ఆట కోచ్‌ లుగా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్‌ క్లారిటీ ఇచ్చారు.

ఆంధ్రా తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్ లుగా గోపీచంద్‌ తమన్నాలు కనిపించబోతున్నారు. ఆ రెండు జట్ల మద్య పోటీ మరియు ఇద్దరు కోచ్‌ ల మద్య జరిగే సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం నిజమైన కబడ్డీ ప్లేయర్‌ లను పలువురిని రంగంలోకి దించుతున్నారు. ఇదే సమయంలో గోపీచంద్‌ మరియు తమన్నాలు కబడ్డీ ట్రైనింగ్‌ తీసుకున్నారట.

సంపత్‌ నంది దర్శకత్వంలో గత ఏడాది ప్రారంభం అయిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. మార్చి నుండి కరోనా కారణంగా పూర్తిగా నిలిచి పోయి ఎట్టకేలకు ఈనెల 23న పునః ప్రారంభంకు రెడీ అవుతుంది. ఈసారి జెట్‌ స్పీడ్‌ గా సినిమాను పూర్తి చేసి వచ్చే సమ్మర్‌ వరకు విడుదల చేయాలని భావిస్తున్నారట.