Begin typing your search above and press return to search.

వీడియో: సీటీమార్ అనేలా కబడ్డీ గీతం..!

By:  Tupaki Desk   |   25 Aug 2021 10:38 AM GMT
వీడియో: సీటీమార్ అనేలా కబడ్డీ గీతం..!
X
డైనమిక్ హీరో గోపీచంద్‌ - మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కలిసి నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్‌ డ్రామా ''సీటీమార్‌''. కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా వేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్.. తాజాగా 'కబడ్డీ ఆంథమ్' లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు.

'నువ్వా నేనా.. నేనా నువ్వా.. నీదా నాదా.. నాదా నీదా..' అంటూ సాగిన ఈ పాటకు సంగీత బ్రహ్మ మణిశర్మ ట్యూన్ కంపోజ్ చేశారు. క్రీడాకారులను మోటివేట్ చేసే విధంగా ఉన్న ఈ గీతానికి కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి - సాయి చరణ్ - రమ్య బెహరా - సాహితీ చాగంటి ఈ పాటను హుషారుగా ఆలపించారు. ఇది సినిమాలో నేషనల్ కబడ్డీ ఛాంపియన్ షిప్ నేపథ్యంలో చిత్రీకరించబడినదిగా తెలుస్తోంది. ఆ పాటలో ఆంధ్ర ప్రదేశ్ మహిళల కబడ్డీ జట్టు కోచ్‌ గా గోపీచంద్.. తెలంగాణ మహిళల కబడ్డీ కోచ్‌ గా తమన్నా తమ జట్లకు దిశానిర్దేశం చేస్తూ కనిపిస్తున్నారు.

'సీటీమార్' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. అలానే 'జ్వాలారెడ్డి' సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ రాబడుతోంది. ఈ క్రమంలో తాజాగా వచ్చిన 'కబడ్డీ ఆంథమ్' కూడా అలరిస్తోంది. ఈ చిత్రానికి సుందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందించగా.. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సత్యనారాయణ ఆర్ట్ డైరెక్టర్. ఇందులో భూమిక - దిగంగనా సూర్యవంశీ కీలక పాత్రలు పోషించారు. రెహమాన్ - రావు రమేష్ - తరుణ్ అరోరా - పోసాని కృష్ణ మురళి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.