Begin typing your search above and press return to search.

విలన్ పాత్రల్లో నటించనని తేల్చేసిన యాక్షన్ హీరో..!

By:  Tupaki Desk   |   23 April 2020 12:00 PM IST
విలన్ పాత్రల్లో నటించనని తేల్చేసిన యాక్షన్ హీరో..!
X
సినీ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - గోపీచంద్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరూ కలిసి 'వర్షం' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ప్రభాస్ - త్రిష జంటగా రూపొందిన 'వర్షం' సినిమాలో విలన్‌ గా గోపిచంద్ విశ్వరూపం చూపించాడు. గోపిచంద్ విలన్‌ గా మారి జయం, నిజం సినిమాల్లో నటించాడు. అయితే ఆ తర్వాత విలనిజానికి స్వస్తి చెప్పి హీరో వేషాలు వేయడం కంటిన్యూ చేసాడు గోపీచంద్. అయితే ‘వర్షం’ కాంబో రిపీట్ అవుతుందని... మళ్లీ గోపిచంద్ విలన్‌గా నటించబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య గోపీచంద్ సినిమాలు వరుస పరాజయాలను చవిచూడటంతో అందరూ ఈ వార్త నిజమే అనుకున్నారు.

'తొలివలపు' చిత్రంతో హీరోగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ యజ్ఞం, ఆంధ్రుడు, గోలీమార్, లక్ష్యం, రణం, లౌక్యం చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొంతకాలంగా గోపీచంద్ సక్సెస్ లేక బాగా వెనకబడిపోయారు. గడిచిన మూడేళ్లలో వరుసగా ఐదు డిజాస్టర్లను గోపీచంద్ అందించారు. ‘జిల్’ సినిమా యావరేజ్ గా నిలిచినా తర్వాత వచ్చిన సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి. ఆరేళ్ల క్రితం వచ్చిన ‘లౌక్యం’ తర్వాత సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నాడు గోపిచంద్ వరుసగా సినిమాలు చేస్తున్నా.. సక్సెస్ మాత్రం దక్కడం లేదు. దీంతో ఆయన మార్కెట్ బాగా తగ్గిపోయింది. దాంతో గోపిచంద్ తిరిగి విలన్‌గా నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. డైరెక్టర్ శివ దర్శకత్వంలో రజనీకాంత్ సినిమాలో గోపిచంద్ విలన్‌ గా చేయబోతున్నారని టాక్ వినిపించింది. శివ దర్శకత్వం లో ‘శౌర్యం’ ‘శంఖం’ సినిమాల్లో నటించాడు గోపిచంద్. ఆ స్నేహంతోనే శివ అడగ్గానే రజిని సినిమాలో విలన్‌ గా చేయడానికి గోపి ఓకే చెప్పాడని వార్తలు వచ్చాయి.

అలాగే ప్రభాస్ కొత్త సినిమా లో గోపిచంద్ నెగిటివ్ రోల్ చేస్తున్నాడని.. రెబల్ స్టార్‌ తో ఉన్న అనుబంధం కారణంగా ‘వర్షం’ కాంబో రిపిటీ కాబోతుందని టాక్ వినిపించింది. అయితే గోపిచంద్ ఈ వార్తలను కొట్టి పారేశాడట. అవసరమైతే మల్టీస్టారర్‌ సినిమాలో నటిస్తాను కానీ విలన్‌ గా మాత్రం చేయను అని తేల్చి చెప్పేశాడట గోపిచంద్. ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్‌లో గోపిచంద్ ‘సిటీమార్’ సినిమా చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ కోచ్‌ గా నటిస్తున్నాడు. మే నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది.