Begin typing your search above and press return to search.

వెంకటరమణ ఒక్కరు కాదు ఇద్దరా?

By:  Tupaki Desk   |   14 April 2021 11:30 AM GMT
వెంకటరమణ ఒక్కరు కాదు ఇద్దరా?
X
యాక్షన్‌ హీరో గోపీచంద్‌ మరియు తేజల కాంబినేషన్‌ లో 'అలివేలుమంగ వెంకటరమణ' చిత్రం ప్రకటన వచ్చి దాదాపుగా ఏడాది దాటింది. హీరోగా పరిచయం అయిన గోపీచంద్ మొదటి సినిమాతో నిరాశ పర్చాడు. ఆ సమయంలో తేజ నుండి గోపీచంద్‌ కు జయం మరియు నిజం సినిమాల్లో విలన్‌ గా ఆఫర్లు వచ్చాయి. ఆ రెండు సినిమాల వల్ల గోపీచంద్‌ కెరీర్‌ పూర్తిగా టర్న్‌ అయ్యింది. మళ్లీ హీరోగా నటించి సక్సెస్‌ ను దక్కించుకున్నాడు. గతంలో తేజ దర్శకత్వంలో విలన్‌ గా చేసిన గోపీచంద్‌ ఈసారి మాత్రం హీరోగా నటించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్‌ గాసిప్‌ ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

'అలివేలుమంగ వెంకటరమణ' సినిమాలో గోపీచంద్‌ డబుల్‌ రోల్‌ లో కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కవల పిల్లలుగా పుట్టిన ఇద్దరు హీరోలు చిన్నతనంలోనే కొన్ని కారణాల వల్ల విడిపోతారు. 30 ఏళ్ల తర్వాత ఇద్దరు ఒక సంఘటన కారణంగా కలుస్తారు. కాని వారిద్దరి కలయిక గొడవతోనే ప్రారంభం అవుతుంది. ఆ గొడవ ఎక్కడికి దారి తీస్తుంది అనేది వెండి తెరపై చూసి తెలుసుకోండి అంటున్నారు. గతంలో గోపీచంద్‌ కు డబుల్‌ రోల్‌ చేసిన అనుభవం ఉంది. కనుక ఈ సినిమాను తప్పకుండా ఆకట్టుకునేలా చేస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

ప్రస్తుతం గోపీచంద్‌ సిటీమార్‌ సినిమా విడుదల కోసం వెయిట్‌ చేస్తున్నాడు. ఈ నెల ఆరంభంలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా వైల్డ్‌ డాగ్‌ తో పోటీ మరియు వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ పూర్తి కాకపోవడం వల్ల సినిమాను ఈ నెల చివర్లో విడుదల చేయాలని భావించారు. కాని కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా గోపీచంద్‌ ఈ నెలలో కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. సిటీమార్‌ సినిమాలో గోపీచంద్‌ కు జోడీగా తమన్నా నటించిన విషయం తెల్సిందే.